Share News

ధాన్యం తూకంలో పారదర్శకత పాటించాలి

ABN , Publish Date - Apr 30 , 2026 | 11:46 PM

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పార దర్శకత పాటించాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. గురువారం బుర్హాన్‌మియాపేట, సుల్తాన్‌పూర్‌, ముప్పిరితోట, ర్యాకల్‌దేవుపల్లి గ్రామాల్లో ఐకేపీ, ఫ్యాక్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

ధాన్యం తూకంలో పారదర్శకత పాటించాలి

ఎలిగేడు, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పార దర్శకత పాటించాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. గురువారం బుర్హాన్‌మియాపేట, సుల్తాన్‌పూర్‌, ముప్పిరితోట, ర్యాకల్‌దేవుపల్లి గ్రామాల్లో ఐకేపీ, ఫ్యాక్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రాములపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్‌ మద్దెల రమాదేవి సంపత్‌లు ప్రారంభించారు. విప్‌ మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు సరైన మద్దతు ధర కొనుగోలు కేంద్రాల ద్వారానే లభిస్తుందన్నారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకొని, తేమ శాతం వచ్చిన తర్వాత మార్కెట్‌కు తర లించి మద్దతు ధర పొందాలన్నారు. నిర్వాహకులు 1010, ఐఆర్‌ 64 రకాల వరిని ఏ గ్రేడ్‌గా స్వీకరించి, మిగతా వరిని సాధారణ ధాన్యంగా తీసుకోవాలని పేర్కొన్నారు. తూకం విషయంలో ఎలాంటి లోపాలు జరగకుండా ప్రతీ ఒక్కరు బాధ్యతగా వ్యవహరించి, రైతులకు న్యాయం చేయాలని కోరారు. సర్పంచ్‌లు గోపు రజిత లక్ష్మారెడ్డి, కవ్వంపల్లి బాపయ్య, రామిడి శైలజ వెంకట్రామిరెడ్డి, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు సామ రాజేశ్వర్‌రెడ్డి, యువజన రాష్ట్ర క్యాదర్శి దుగ్యాల సంతోష్‌ రావు, అర్శనపల్లి వెంకటేశ్వర్‌ రావు, సీఈఓ గడ్డం రవీందర్‌ రెడ్డి, కేశెట్టి విక్రమ్‌, ఏఓ ఉమాపతి, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2026 | 11:46 PM