సమ్మక్క సారలమ్మ జాతరకు పటిష్ట ఏర్పాట్లు
ABN , Publish Date - Jan 20 , 2026 | 12:26 AM
మండ లంలోని వివిధ గ్రామాలలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు మార్ అన్నారు. సోమవారం కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మండలంలో పర్యటించి ఎంపి డిఓ కార్యాలయంలో సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
ధర్మారం, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): మండ లంలోని వివిధ గ్రామాలలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు మార్ అన్నారు. సోమవారం కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మండలంలో పర్యటించి ఎంపి డిఓ కార్యాలయంలో సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ దొంగతుర్తి, బోట్లవనపర్తి, నంది మేడారం, ధర్మారం, కటికనపల్లి, కొత్తూరు, ఎర్ర గుట్టపల్లిలో వేలాది మంది భక్తులు సమ్మక్క సారలమ్మ జాతర కోసం వస్తారన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అంచనాలు తయారు చేయాలన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మేడారం సమ్మక్క సార లమ్మ జాతరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిరిజన సంక్షేమ శాఖ నుంచి 272 కోట్ల రూపాయలు కేటాయించి మేడారంలో శాశ్వత నిర్మాణాలు చేశారని మంత్రి తెలిపారు. మండలంలో జాతర జరిగే గ్రామాలకు కార్య దర్శులను ఇంచార్జి గా నియమించామన్నారు. పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత కల్పించాలని, ఎటువంటి సమస్యలు వచ్చిన మండల పంచాయతీ అధికారి దృష్టికి తీసుకుని రావాలని మంత్రి తెలిపారు. జాతర వద్ద గద్దెల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎస్.డి.ఎఫ్ నుంచి నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, జాతర నిర్వహణ కమిటీలతో సమన్వయం చేసుకుంటూ అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, జాతరకు తక్కువ సమయం ఉన్నందున భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు ఉండాలని, దీనికి తగిన విధంగా ప్రణాళికలు తయారు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. మండల కేంద్రంలోని సమ్మక్క సారలమ్మ గద్దెలను సందర్శించారు. జడ్పీ సీఈఓ నరేందర్, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, తహసిల్దార్ డి. శ్రీనివాస్, ఎంపిడిఓ వేముల సుమలత , సంబంధించిన అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.