Share News

ఘోరం.. కోనేరులో పడి ముగ్గురు చిన్నారుల మృతి..

ABN , Publish Date - May 20 , 2026 | 07:00 PM

జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మేడిపల్లి మండలం కొండాపూర్‌లో ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తూ మృతిచెందారు. శివగంగా ఆలయ కోనేరులో పడి ప్రాణాలు కోల్పోయారు.

ఘోరం.. కోనేరులో పడి ముగ్గురు చిన్నారుల మృతి..
Jagtial Tragedy

జగిత్యాల: జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మేడిపల్లి మండలం కొండాపూర్‌లో ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తూ మృతిచెందారు. శివగంగా ఆలయ కోనేరులో పడి ప్రాణాలు కోల్పోయారు. మృతిచెందిన చిన్నారులను మన్వీత్ (11), మనస్వి (9), షార్వింద్ (7)గా గుర్తించారు. ఈరోజు (బుధవారం) మధ్యాహ్న సమయంలో సరదాగా ఆడుకునేందుకు ఆలయం వద్దకు వెళ్లిన చిన్నారులు.. అనంతరం ఈత కొట్టేందుకు కోనేరులో దిగారు. అయితే ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయారు. కాపాడాలంటూ కేకలు వేశారు.


కొద్దిసేపటి తర్వాత ప్రమాదాన్ని గమనించిన స్థానికులు కోనేరులో నుంచి వారిని బయటకు తీశారు. ముగ్గురినీ హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ క్రిటికల్ కేర్ ఆస్పత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. భారతి-భూషణం దంపతుల పిల్లలు మన్వీత్, మనస్వి కాగా.. భార్గవి-శేఖర్ కుమారుడు షార్వింద్. చిన్నారుల మృతితో బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. మరోవైపు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

అత్తాపూర్ కిడ్నాప్‌ కేసు.. ఇంట్లోనే సేఫ్‌గా ఉన్న యువతి

శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుపడిన హైగ్రేడ్ గంజాయి..

Updated Date - May 20 , 2026 | 07:03 PM