కొనుగోళ్ళలో ఎలాంటి కటింగ్‌లు ఉండొద్దు
ABN , Publish Date - May 14 , 2026 | 12:04 AM
కొనుగోళ్ళలో ఎలాంటి కటింగ్‌లో ఉండొద్దని, కేంద్రాల నుంచి రైస్‌మిల్లులకు వస్తున్న ధాన్యం లారీలను 24 గంటల్లో అన్‌లోడ్ చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష మిల్లర్లను ఆదేశించారు. మండలంలోని పలు గ్రామాలలో ఉన్న రైస్‌మిల్లులను బుధవారం తనిఖీలు చేశారు.
సుల్తానాబాద్, మే 13 (ఆంధ్రజ్యోతి): కొనుగోళ్ళలో ఎలాంటి కటింగ్‌లో ఉండొద్దని, కేంద్రాల నుంచి రైస్‌మిల్లులకు వస్తున్న ధాన్యం లారీలను 24 గంటల్లో అన్‌లోడ్ చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష మిల్లర్లను ఆదేశించారు. మండలంలోని పలు గ్రామాలలో ఉన్న రైస్‌మిల్లులను బుధవారం తనిఖీలు చేశారు. మిల్లుల్లో ఉన్న నిలువల రికార్డులను చూశారు. ధాన్యం అన్‌లోడింగ్, నిల్వలు, ట్యాబ్ ఎంట్రీలు, ట్రక్ షీట్ల జనరేషన్ తదితర అంశాలను పరిశీలించారు. సుగ్లాంపల్ల్లి, పూసాల, కాట్నపల్లిలోని పలు మిల్లులను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. మిల్లర్లతో మాట్లాడుతు కేంద్రాల నుంచి మిల్లుకు వచ్చిన ధాన్యం లారీలను 24 గంటల్లోనే అన్‌లోడ్ చేయించాలని ఆదేశించారు. అవసరమైతే ఎక్కువ మంది హమాలీలను నియమించుకోవాలన్నారు. ఎలాంటి కోతలు, కటింగ్‌లు పెట్టవద్దన్నారు. అన్‌లోడింగ్ సమస్య ఉన్న మిల్లుల్లో అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలు కురిసే అవకాశం ఉందని, అధికారులు సమన్వయంతో పని చేస్తూ కేంద్రాలను సందర్శించి కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. కేంద్రాల వద్ద అవసరమైన గన్నీ బ్యాగులు, టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచుకోవాలని, ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు అవసరమైన వాహనాలను సమకూర్చుకోవాలన్నారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీనాథ్‌తో పాటు పలువురు అధికారులు, మిల్లర్లు ఉన్నారు. కలెక్టర్ వరుసగా తనిఖీలు చేస్తున్నా మిల్లర్లలో ఎలాంటి మార్పు రాకపోవడంతో బుధవారం మరోసారి తనిఖీ చేపట్టారు. కలెక్టర్ ఆదేశాలతో రైస్‌మిల్లర్లలో అలజడి మొదలైంది.