అసాంఘిక శక్తులపై నిరంతర నిఘాపెట్టాలి
ABN , Publish Date - Nov 12 , 2026 | 11:39 PM
కమిషనరేట్ పరిధిలోని ప్రతీ ఎస్‌హెచ్‌ఓ, సీఐ తమ పరిధిలోని రౌడీ షీటర్లు, అసాంఘిక శక్తులపై ప్రత్యేక నిఘా పెట్టాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. గురువారం కమిషనరేట్‌లో నేర సమీక్ష సమావేశంలో మాట్లాడారు.
కోల్‌సిటీ, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): కమిషనరేట్ పరిధిలోని ప్రతీ ఎస్‌హెచ్‌ఓ, సీఐ తమ పరిధిలోని రౌడీ షీటర్లు, అసాంఘిక శక్తులపై ప్రత్యేక నిఘా పెట్టాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. గురువారం కమిషనరేట్‌లో నేర సమీక్ష సమావేశంలో మాట్లాడారు. రౌడీషీటర్లు, రాజకీయ, ఇతర అనుబంధాలతో సంబంధం లేకుండా వారిపై నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. ఆస్తి తగాదాలు, బెదిరింపులు, దాడులపై దృష్టి పెట్టాలని, ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్ నిర్వహిస్తూ నిరంతర నిఘా కొనసాగించాలన్నారు. నేరాల నియంత్రణకు పోలీస్ అధికారులు తమ సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని, ప్రతి ఘటనపై నేరాలు జరుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
చిన్న సమస్యనైనా వెంటనే స్పందించాలన్నారు. సీఐలు, ఏసీపీలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వాస్తవ పరిస్థి తులను అంచనా వేయాలని సీపీ సూచించారు. ఎస్‌హెచ్‌ఓలకు నిరం తరం మార్గనిర్దేశనం చేస్తూ పోలీస్ స్టేషన్ల రోజు వారి పని తీరు, కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసులు, నేరాల పరిస్థితి ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలను క్రమం తప్పకుండా సమీక్షించాలన్నారు. గంజాయి పటు ్టబడినా దాని వెనుక ఉన్న సరఫరా వ్యవస్థ, మధ్యవర్తులు, విని యోగ దారుల నెట్‌వర్క్‌పై దర్యాప్తు చేపట్టాలని సీపీ ఆదేశించారు. మంచి ర్యాల డీసీపీ భాస్కర్, పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి, అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కే శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్, పెద్దపల్లి ఏసీపీ జీ కృష్ణ, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, జైపూర్ ఏసీపీ ఆరె వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, ఎస్‌బీ ఏసీపీ నాగేంద్రగౌడ్, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీని వాసరావు, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, సైబర్ క్రైమ్ డీఎస్‌పీ రంగారెడ్డి, ఏఆర్ సీపీ రమేష్‌తో పాటు సీఐలు, ఎస్‌హెచ్‌ఓలు పాల్గొన్నారు.
పోలీస్ వాహనాలను కండీషన్‌లో ఉంచుకోవాలి
పోలీస్ వాహనాలను కండీషన్‌లో ఉంచుకోవాలని పోలీస్ కమి షనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. గురువారం పెద్దపల్లి, మంచి ర్యాల జిల్లాల పోలీస్ వాహనాలను కమిషనరేట్‌లో తనిఖీ చేశారు. వాహనాల కండీషన్, వాహనాల్లో ఏర్పాటు చేసిన సమాచార, ప్రసార పరికరాలు, వైర్‌లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థ పని తీరును పరిశీలిం చారు. అత్యవసర సమయంలో అధికారులు, సిబ్బంది మధ్య సమాచా రం ప్రసారం వేగంగా జరిగేలా కమ్యూనికేషన్ పరికరాలు నిరంతరం పని చేసేలా ఉండాలన్నారు. ఉత్తమ పని తీరు కనబరిచే ఐదుగురు డ్రైవర్లను గుర్తించి ప్రోత్సాహకాలు అందించాలని సీపీ ఆదేశించారు.