Share News

నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు

ABN , Publish Date - May 20 , 2026 | 11:33 PM

ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయరమణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలో వరి, మక్కల కొనుగోళ్ళలో మాజీ ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడటాన్ని ఖండిస్తున్నామని తెలిపారు.

నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు

పెద్దపల్లి టౌన్‌ మే 20 (ఆంధ్రజ్యోతి): ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయరమణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలో వరి, మక్కల కొనుగోళ్ళలో మాజీ ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడటాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో రైతులకు సంబంధించిన కొనుగోళ్లు పారదర్శకంగా జరుగుతున్నాయని వివరించారు. మంగళవారం మనోహర్‌ రెడ్డి మాటలను వింటుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉన్నాయని, వారి మాటలు ప్రజలు నమ్మే ప్రసక్తి లేదన్నారు. వడ్ల కొనుగోలు విషయంలో మాట్లాడే అర్హత మనోహర్‌ రెడ్డి కి లేదని, వారి హయంలో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలో క్వింటాల్‌కు పది నుంచి పదిహేను కిలోల వరకు కోతలు విధించి రైతుల నడ్డివిరిచారన్నారు. మనోహర్‌ రెడ్డి తెలిసినంత అక్రమ దందాల గురించి మాకెవ్వరికి తెలియదని, వారి ప్రభుత్వ హయంలో ఇసుక మాఫియా, మట్టి అక్రమ దందాలు చేసింది ఎవరో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసన్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు రైతులకు సాగు నీరందిచక అరిగోస పెట్టి అన్నదాతల ఆదాయానికి గండికొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో చివరి ఆయకట్టు చివరి ప్రాంతం వరకు సాగునీరు అందించి రైతన్న మొహంలో ఆనందం చూపుతున్నామని, రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంట విషయంలో కూడా ఎలాంటి కోతలు లేకుండా అన్నదాతలకు అండగా నిలుస్తున్నామని గుర్తు చేశారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మక్కలు కొనుగోలు చేస్తూ రైతులకు అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం సేకరించిన మక్కలకు మార్కెటింగ్‌ లేకున్నప్పటికీ నష్టాన్ని భరిస్తూ ప్రభుత్వం ముందుకు వెళుతుందని చెప్పారు. అక్కడక్కడ ఉన్న మీ తాబెదరులతో రైతులను మభ్యపెట్టి కొనుగోలు కేంద్రాల వద్ద గందరగోళాలు చేస్తామంటే సహించేది లేదని విమర్శించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌, వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్లు, డైరెక్టర్లు, సింగిల్‌ విండో చైర్మన్లు, డైరెక్టర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 20 , 2026 | 11:33 PM