అభివృద్ధి విషయంలో రాజీపడేది లేదు
ABN , Publish Date - Jun 30 , 2026 | 12:01 AM
అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదని, రాష్ట్రంలోనే పెద్దపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నా రు. సోమవారం పెద్దబొంకూరులో రూ.2.40 కోట్లతో నిర్మించిన హై లెవెల్ వంతెన, రూ.12 కోట్లతో నిట్టూరు నుండి కాచాపూర్ వరకు బీటీ రోడ్డును ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చిం తకుంట విజయరమణరావు ప్రారంభించారు.
పెద్దపల్లి రూరల్, జూన్ 29(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదని, రాష్ట్రంలోనే పెద్దపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నా రు. సోమవారం పెద్దబొంకూరులో రూ.2.40 కోట్లతో నిర్మించిన హై లెవెల్ వంతెన, రూ.12 కోట్లతో నిట్టూరు నుండి కాచాపూర్ వరకు బీటీ రోడ్డును ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చిం తకుంట విజయరమణరావు ప్రారంభించారు. సీజీఎఫ్ నిధులతో శివాలయంలో రూ.40 లక్షల తో రాజగోపురం, అర్చకుల వసతి గృహ నిర్మా ణానికి శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లా డుతూ కోట్ల రూపాయల నిధులతో నియోజక వర్గం గతంలో ఎన్నడూలేని విధంగా అభివృద్ధి చెందుతుందన్నారు. పెద్దబొంకూరు నుండి కొల నూరు మీదుగా వెళ్ళే ప్రయాణికుల సౌకర్యార్థం రూ.2.40 కోట్లతో హై లెవెల్ వంతెన నిర్మించా మన్నారు. నిట్టూరు నుండి కాచాపూర్ వరకు రూ.12 కోట్లతో నిర్మించిన బిటి రోడ్డును ప్రారం భించామన్నారు. బస్ డిపో, బైపాస్ రోడ్డు, ప్రభుత్వ ఆసుపత్రి ఆధునికీకరణ, పోలీస్ స్టేషన్లు, పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీల అభివృద్ధి, చేపడుతున్నామని గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ, రైతు భరోసా, రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీలేని రుణాలు, గ్యాస్ సబ్సిడీ పథకాలను ప్రజలకు అందిస్తుందని తెలి పారు. ఆర్‌అండ్‌బి అధికారులు, పలు గ్రామాల సర్పంచ్‌లు నర్ల కనుకమ్మపోల్‌రాజు, ఆకుల సువర్ణశ్రీనివాస్, పెర్క రిబ్కాసంతోష్, కల్వల తిరుపతి, నాయకులు గిరినేని సంపత్‌రావు, మాజీసర్పంచ్ రమేష్, సంతోష్, ఉపసర్పంచ్‌లు, పాల్గొన్నారు.