ఎరువుల సరఫరాలో ఇబ్బందులుండవు
ABN , Publish Date - Apr 21 , 2026 | 12:38 AM
రాష్ట్రంలో వచ్చే ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఎరువుల సరఫరాలో ఇబ్బందులు ఉండ కుండా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ కార్య దర్శి సురేంద్ర మోహన్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా రామ గుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్‌ఎఫ్‌సీఎల్)ను సోమవారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి సందర్శించారు.
కోల్‌సిటీ, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వచ్చే ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఎరువుల సరఫరాలో ఇబ్బందులు ఉండ కుండా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ కార్య దర్శి సురేంద్ర మోహన్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా రామ గుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్‌ఎఫ్‌సీఎల్)ను సోమవారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి సందర్శించారు. ప్లాంట్‌లోని యూరియా, అమ్మోనియా ప్లాంట్, రైల్వే లోడింగ్ పాయింట్‌లను పరిశీలించారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో యూరియా ఉత్పత్తి, యంత్రాల పనితీరు, నిల్వలను పరిశీలిం చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ఆర్‌ఎఫ్ సీఎల్ ప్లాంటే ప్రధాన యూరియా సరఫరాదారు అని, ఖరీఫ్ సీజన్‌లో ఎలాంటి ఆలస్యం లేకుండా ప్లాంట్ నుంచి ఎరువుల సరఫరా చేయాలని ఆయన కోరారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫెర్టి లైజర్స్(డీవోఎఫ్) కేటాయింపుల ప్రకారం యూరియాను సర ఫరా చేయాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్‌ఎఫ్ సీఎల్‌కు అన్ని విధాల సహకారం ఉంటుందని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి ఎరువుల సరఫరాలో లోపాలు లేకుండా చూసుకోవాలన్నారు. సమీక్షలో ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్లాంట్ హెడ్ జిందాల్, ప్రొడక్షన్ హెడ్ సాహా, టెక్నికల్ సర్వీస్‌హెడ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.