Share News

టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలి

ABN , Publish Date - Jul 31 , 2026 | 11:33 PM

ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు టెండర్ల ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయశ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన ఎలిగేడు మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మించనున్న 15 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంగల గోదాం నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.

టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలి

ఎలిగేడు, జూలై31(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు టెండర్ల ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయశ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన ఎలిగేడు మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మించనున్న 15 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంగల గోదాం నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. గోదాం నిర్మాణానికి సంబంధించిన టెండర్లను వేగంగా పూర్తి చేయాలన్నారు. నిర్ణీత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డీసీఓ శ్రీమాల, తహసీల్దార్‌ యాకన్న, అధికారులు పాల్గొన్నారు.

ఇంకుడు గుంత ఉంటేనే ఇంటి నంబరు

పెద్దపల్లి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): పట్టణాల్లో కొత్తగా నిర్మించే ప్రతీ ఇంటికి ఇంకుడు గుంత (సోక్‌పిట్‌) తప్పనిసరి కానుంది. ఇంకుడు గుం త లేకుంటే ఇంటి నంబర్‌తో పాటు నల్లా కనెక్షన్‌ కూడా మంజూరు చేయమని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు. భూగర్భ జలాల పెంపు, వర్షపు నీటి సంరక్షణ, కాలానుగుణ వ్యాధుల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ (లోకల్‌ బాడీస్‌) అరుణశ్రీతో కలిసి మున్సిపల్‌ కమిషనర్లతో నిర్వహించిన పట్టణ పరిపాలన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జల్‌ సంచయ్‌ - జన భాగిధారి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకునేలా ప్రజ ల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఇప్పటికే నిర్మించిన ఇళ్లలో కూడా ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి వీలైనంత ఎక్కువగా సోక్‌ పిట్‌లు ఏర్పాటు చేయించాలని ఆదేశించారు. ప్రతీ వార్డు పరిధిలో రాను న్న నెల రోజుల్లో కనీసం 30 ఇంకుడు గుంతలు నిర్మించేలా కార్యాచరణ రూపొందించాలని మున్సిపల్‌ కమిషనర్లకు సూచించారు. వార్డు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని లక్ష్ష్యాలను పూర్తి చేయాలని చెప్పారు. అలాగే ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో తప్పనిసరిగా సోక్‌పిట్‌లు ఏర్పాటు చేసి వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మున్సిపల్‌ కమిషనర్లు వెంకటేష్‌, రమేష్‌తో పాటు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2026 | 11:33 PM