Share News

క్రీడాకారుల ప్రతిభ అభినందనీయం

ABN , Publish Date - Aug 22 , 2026 | 12:14 AM

ఆర్‌జీ-1 ఏరి యాకు చెందిన స్విమ్మింగ్‌ క్రీడాకారులు తెలంగాణ మాస్ట ర్స్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ ఛాంపియన్‌షిప్‌-2026లో ప్రతి భ కనబరిచి 15 పతకాలు సాధించడం అభినందనీయమని ఆర్‌జీ-1 జీఎం డీ లలిత్‌ కుమార్‌ అన్నారు.

క్రీడాకారుల ప్రతిభ అభినందనీయం

గోదావరిఖని, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): ఆర్‌జీ-1 ఏరి యాకు చెందిన స్విమ్మింగ్‌ క్రీడాకారులు తెలంగాణ మాస్ట ర్స్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ ఛాంపియన్‌షిప్‌-2026లో ప్రతి భ కనబరిచి 15 పతకాలు సాధించడం అభినందనీయమని ఆర్‌జీ-1 జీఎం డీ లలిత్‌ కుమార్‌ అన్నారు. ఈనెల 15, 16 తేదీల్లో హైదరాబాద్‌ అంబర్‌పేటలోని జీహెచ్‌ఎంసీలో జరిగిన 11వ తెలంగాణ మాస్టర్స్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఆర్‌జీ-1 ఏరియాకు చెందిన సింగరేణి క్రీడాకారులు పతకాలు సాధించారు. మాదిరెడ్డి శ్రీధర్‌, మంగా వెంకటేశ్వర్లు, రాపర్తి ప్రశాంత్‌, రామారావు, బం గారి రాజయ్య, ఏ రమేష్‌ పతకాలు సాధించారు. క్రీడాకారులను జీఎం అభినందించారు. పర్సనల్‌ మేనేజర్‌ రెడ్డిమల్ల తిరుపతి, సీనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ హను మంతరావు, స్విమ్మింగ్‌ కోచ్‌ కృష్ణమూర్తి, పాల్గొన్నారు.

Updated Date - Aug 22 , 2026 | 12:14 AM