Share News

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

ABN , Publish Date - Mar 08 , 2026 | 12:09 AM

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే అనారోగ్యాలు దరిచేరవని కార్పొరేటర్‌ నిమ్మరాజుల రజని రవి అన్నారు. శని వారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా లింగాపూర్‌ ప్రభుత్వ పాఠశాలలో శానిటేషన్‌, స్వచ్ఛ రామగుండం కార్యక్రమాన్ని నిర్వహించారు.

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

అంతర్గాం, మార్చి 7(ఆంధ్రజ్యోతి): పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే అనారోగ్యాలు దరిచేరవని కార్పొరేటర్‌ నిమ్మరాజుల రజని రవి అన్నారు. శని వారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా లింగాపూర్‌ ప్రభుత్వ పాఠశాలలో శానిటేషన్‌, స్వచ్ఛ రామగుండం కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రణాళికను విజయవంతం చేయాలన్నారు. ప్లాస్టిక్‌ ను నిషేధిస్తూ చెత్తను మున్సిపల్‌ వాహనంలో వేయా లని కోరారు. వార్డు ఆఫీసర్‌ మంగ, మున్సిపల్‌ సూప ర్‌వైజర్‌ సోమేష్‌, ఇన్‌చార్జి ఐలేష్‌, ప్రధానోపాధ్యా యులు పద్మ, ఆర్‌పీ వనజ, భారతి, ఏఎన్‌ఎంఉమా, ఆశా వర్కర్‌ మంజుల, అంగన్‌వాడీ టీచర్‌ అరుణ, ఉపాధ్యాయులు సంజీవ్‌, స్వర్ణ, పాల్గొన్నారు.

కేజీబీవీ బాలికల హాస్టల్‌ను ఎల్లంపల్లి సర్పంచ్‌ అరుముల్ల మాధవి మల్లేష్‌ సందర్శించారు. పరిసరా లను పరిశీలించి, హాస్టల్‌లో విద్యార్థుల భోజన వసతి, వంట గదిని తనిఖీ చేశారు. ఎంపీ డీఓ తిరుపతి, ఎంపీఓ వేణు, ఎల్లంపల్లి కార్యదర్శి సాగర్‌, హాస్టల్‌ ప్రిన్సిపాల్‌ కల్పనతో కలిసి సందర్శిం చారు.

ఎలిగేడు, (ఆంధ్రజ్యోతి): ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభను సర్పంచ్‌ పల్లెర్ల వెంకటేష్‌ గౌడ్‌ అధ్యక్షతన నిర్వహించారు. పారిశుధ్య పనులు, ప్లాస్టిక్‌ ను నివారించి క్యాన్సర్‌రహిత గ్రామంగా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ సూచనలు, సలహాలు పాటి స్తూ ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో తీసుకు పోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఉపాధిహామీ, ఇందిరమ్మ ఇండ్ల పురోగతి, పారిశుధ్యం, పన్నుల వసూలు, నీటి ఎద్దడి నివారణతోపాటు పలు అంశాలపై చర్చించారు. ఎంపీఓ కిరణ్‌, సర్పంచ్‌ వెంకటేష్‌ గౌడ్‌, ఉపసర్పంచ్‌ గోసిక రవీందర్‌, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి లలిత పాల్గొన్నారు. అనంతరం ఉపాధి పనులు చేస్తున్న కూలీలకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు.

రామగిరి, (ఆంధ్రజ్యోతి): సెంటినరీకాలనీలోని జెఎన్‌టియు కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహి స్తున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల ప్రాంగణంలో క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ కార్యక్రమాన్ని విద్యార్థులు, అధ్యాపకులు చేపట్టారు. చెత్తా చెదారం, పిచ్చిమొక్కల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రిన్సిపాల్‌ విష్ణువర్ధన్‌, పరిపాలనాధికారి సుమన్‌, ప్రజాపాలన కమిటీ సభ్యుడు కృష్ణారెడ్డి, సదానందం, కుమార్‌, శ్రీధర్‌, హౌజ్‌కీపింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ధర్మారం, (ఆంధ్రజ్యోతి): ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదివారం నుంచి స్వయం సహా య సంఘాల మహిళలకు హెల్త్‌ ప్రొఫైల్‌ కార్యక్ర మం నిర్వహించనున్నట్లు వైద్యాధికారి అను దీప్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 31 వరకు నిర్వహించే కార్యక్రమంలో మహిళలకు 30 రకాల పరీక్షలను చేయించి హెల్త్‌ ప్రొఫైల్‌ను తయారు చేస్తామన్నారు.

Updated Date - Mar 08 , 2026 | 12:09 AM