దళితుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది
ABN , Publish Date - Nov 22 , 2026 | 11:21 PM
దళితుల సంక్షేమం, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వారికి రావాల్సిన హక్కులు, సంక్షేమ పథకాలను పెద్దపల్లి ప్రాంతానికి తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు స్పష్టం చేశారు.
పెద్దపల్లి టౌన్, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): దళితుల సంక్షేమం, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వారికి రావాల్సిన హక్కులు, సంక్షేమ పథకాలను పెద్దపల్లి ప్రాంతానికి తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు స్పష్టం చేశారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్‌ఆర్ గార్డెన్స్‌లో స్వర్ణోత్సవ మహాసభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ విజయరమణ రావు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్, పెద్దపల్లి డీసీపీ భూక్య రామ్‌రెడ్డి, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్, జిల్లా బీసీ జేఏసీ చైర్‌పర్సన్ దాసరి ఉష, సీపీఐ నాయకుడు తాండ్ర సదానందం తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయరమణ రావు మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేయాలన్న చిరకాల డిమాండ్‌ను త్వర లోనే నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. రూ.5 కోట్ల వ్యయం తో నిర్మించనున్న నాలెడ్జ్ సెంటర్ భవనానికి శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. ప్రతిపాదిత స్థలంపై కోర్టు వివా దం ఉంటే వివరాలు సేకరించాలని ఇప్పటికే ఆర్డీఓ, కలె క్టర్లకు సూచించినట్లు తెలిపారు. అవసరమైతే ప్రత్యా మ్నాయ స్థలాన్ని ఎంపిక చేసి మంత్రులు శ్రీధర్‌బాబు, లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిలోపు సుల్తానాబాద్‌లో కాంస్య విగ్రహం, సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. పెద్దపల్లి కూడలి డిజైన్‌పై 15 నుంచి 20 రోజుల్లో నిర్ణయం తీసుకుంటే రూ.50 లక్షలతో ఆకర్షణీయంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. సంఘం 50 ఏళ్ల స్వర్ణోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. స్వర్ణోత్సవ కమిటీ చైర్మన్, సంఘం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు మామిడిపల్లి బాపయ్య, కన్వీనర్ మైస రాజేష్, వైస్ చైర్మన్ లంక సదయ్య, సమన్వయకర్త కుక్క అశోక్, కో కన్వీనర్ పొనుగంటి రాజనర్సు, సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బొంకూరి మధు అధ్యక్షతన ఈ సభ జరిగింది.
బలహీనవర్గాల హక్కుల కోసం పోరాడుతా : ఎంపీ
దేశ జనాభాలో 25 నుంచి 30 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ వర్గాలకు బడ్జెట్‌లో కేవలం 2 శాతం నిధులు కేటాయిం చడం బాధాకరమని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. జనాభా దామాషా ప్రకారం 25 నుంచి 30 శాతం నిధులు కేటాయించాలని పార్లమెంట్‌లో డిమాండ్ చేస్తానన్నారు. దళితులు ఐక్యంగా ఉండి రాజకీయంగా ఎదగాలని పిలుపునిచ్చారు. 70 ఏళ్లుగా జరుగుతున్న అన్యాయాన్ని ఇకపై సహించబోమని, రాజ్యాంగాన్ని మార్చే కుట్రల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం ముఖ్య అతిథులను నిర్వాహకులు శాలువాలతో ఘనంగా సత్కరించి మెమెంటోలు అందజేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కవ్వంపల్లి సతీష్, కార్యదర్శి పాల రాజేశం, జిల్లా నాయకులు గుట్ట లింగయ్య, ఆరెల్లి మల్లేష్, చొప్పదండి మల్లేశం, సంకెనపల్లి లక్ష్మయ్య, నక్క శంకరయ్య, బొల్లి నందయ్య, భూపెల్లి మల్లేశం, బాదె వెంకటేష్, బూడిద సమ్మయ్య, చుంచు మల్లేష్, కాసిపేట పోచయ్య, పెరక బానేష్, బోసెల్లి నారాయణ, పాల్గొన్నారు.