Share News

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి

ABN , Publish Date - Oct 06 , 2026 | 12:17 AM

స్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హెల్ప్‌ డెస్క్‌ల ద్వారా సమాచారం, సహకారం అందించాలని ఎలక్టోరల్‌ రోల్‌ రాష్ట్ర పరిశీలకులు బాల మాయదేవి సూచించారు. సోమవారం పద్మనాయక ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) హెల్ప్‌ డెస్క్‌ను ఎన్నికల రోల్‌ అబ్జర్వర్‌ బాల మాయ దేవి, కలెక్టర్‌ కోయ శ్రీహర్ష పరిశీలించారు.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి

సుల్తానాబాద్‌, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హెల్ప్‌ డెస్క్‌ల ద్వారా సమాచారం, సహకారం అందించాలని ఎలక్టోరల్‌ రోల్‌ రాష్ట్ర పరిశీలకులు బాల మాయదేవి సూచించారు. సోమవారం పద్మనాయక ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) హెల్ప్‌ డెస్క్‌ను ఎన్నికల రోల్‌ అబ్జర్వర్‌ బాల మాయ దేవి, కలెక్టర్‌ కోయ శ్రీహర్ష పరిశీలించారు. ఎలక్టోరోల్‌ అబ్జర్వర్‌ మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. హెల్ప్‌డెస్క్‌ల వద్దకు వచ్చే ఓటర్లకు దరఖాస్తుల విధానం, అవసరమైన పత్రాలు, నోటీసులకు సంబంధించిన అంశాలపై సమాచారం అందించాలని తెలిపారు. ఫారం 6, ఫారం 7, ఫారం 8 దరఖాస్తుల స్వీకరణ, అవసరమైన పత్రాలు, దరఖాస్తుల స్థితిగతులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ఎప్పటికపుడు పరిశీలించి పరిష్కరించాలన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా, నిబంధనలకు అనుగుణంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. నోటీసులు అందుకున్న ఓటర్లను ఇళ్ల వద్దనే వివరాలను పరిశీలించి, అవసరమైన పత్రాలను సేకరించాలని ఆదేశించారు. ఆర్డీఓ బి. గంగయ్య, సుల్తానాబాద్‌ తహసీల్దార్‌ బషీరుద్దీన్‌, సంబంధిత ఎన్నికల అధికారులు, బీఎల్‌ఓలు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 06 , 2026 | 12:17 AM