Share News

నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకోవాలి

ABN , Publish Date - Jan 14 , 2026 | 11:51 PM

సింగరేణి సంస్థ నిర్థేశించిన ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవాలని సింగరేణి డైరెక్టర్‌(పిఅండ్‌ పి)వెంకటేశ్వర్‌రావు అన్నారు. బుధవారం సింగరేణి సంస్థ ఆర్జీ-3, ఏపిఏ డివిజన్‌లలో పర్య టించారు.

నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకోవాలి

రామగిరి, జనవరి 14(ఆంధ్రజ్యోతి):సింగరేణి సంస్థ నిర్థేశించిన ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవాలని సింగరేణి డైరెక్టర్‌(పిఅండ్‌ పి)వెంకటేశ్వర్‌రావు అన్నారు. బుధవారం సింగరేణి సంస్థ ఆర్జీ-3, ఏపిఏ డివిజన్‌లలో పర్య టించారు. అనంతరం జీఎం కార్యాలయంలో ఆర్జీ-3, ఏపిఏ జీఎంలు మధు సూదన్‌, నాగేశ్వర్‌రావులతో భేటీ అయ్యారు. బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, రవాణా తదితర అంశాలపై చర్చించారు. ఏఎల్‌పిలో జరిగే 3వ ప్యానల్‌ సాల్వేజింగ్‌ పనుల పురోగతి, 4వ ప్యానెల్‌ తయారీ పనులపై చర్చించారు. ఈ సందర్బంగా డైరెక్టర్‌ మాట్లాడారు. నిర్ధేశించిన ఓబీ, బొగ్గు ఉత్పత్తి లక్ష్యా లను సాధించేందుకు పూర్తిస్థాయిలో యంత్రాల వినియోగం ఉండాలన్నారు. ప్రణాళికబద్దంగా కృషి చేస్తే గణనీయమైన ఉత్పత్తిని సాధించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు రెండు మాసాలు మాత్రమే ఉన్న నేపథ్యంలో సమిష్టిగా ఉత్పత్తి లక్ష్యాలను చేరుకో వాలని సూచించారు. అధికారులు రామ్మోహన్‌, రాజారెడ్డి, మురళికృష్ణ, సత్యనారాయణ, ఐలయ్య, షబ్బీరుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 14 , 2026 | 11:51 PM