పోలీస్ అమరవీరుల సేవలు మరువలేనివి
ABN , Publish Date - Oct 27 , 2026 | 12:21 AM
విధి నిర్వ హణలో అమరులైన పోలీసుల సేవలు మరువలేనివని మేయర్ మహకాళి స్వామి, ఏసీపీ మడత రమేష్ అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భం గా సోమవారం రాత్రి గోదావరిఖని చౌరస్తాలో కొవ్వొ త్తులతో ప్రదర్శన నిర్వహించారు.
కోల్‌సిటీ, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): విధి నిర్వ హణలో అమరులైన పోలీసుల సేవలు మరువలేనివని మేయర్ మహకాళి స్వామి, ఏసీపీ మడత రమేష్ అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భం గా సోమవారం రాత్రి గోదావరిఖని చౌరస్తాలో కొవ్వొ త్తులతో ప్రదర్శన నిర్వహించారు. వారు మాట్లాడుతూ ప్రజల శాంతి భద్రతలు, ఆస్తిని కాపాడటానికి నిరంత రం సేవలు అందించేది పోలీస్‌శాఖ అని, విధి నిర్వ హణలో అమరులైన పోలీసుల సేవలు మరువలేనివ న్నారు. సీఐ ఇంద్రసేనారెడ్డి, ట్రాఫిక్ సీఐ రాజేశ్వర్‌రావు, ఎస్‌ఐలు రాజశేఖర్, రామరాజు పాల్గొన్నారు.
కోల్‌సిటీ, (ఆంధ్రజ్యోతి): పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో సీఐ ఇంద్రసేనారెడ్డి విద్యార్థు లకు ఓపెన్‌హౌస్ నిర్వహించారు. పోలీస్‌శాఖలో వినియోగిస్తున్న సాంకే తిక పరిజ్ఞానం, ప్రజలకు అందిస్తున్న సేవలు, డయల్ 112, షీ టీం, సైబర్ క్రైం, డ్రంకెన్ డ్రైవ్ నష్టాలపై అవగాహ న కల్పించారు. ఎస్‌ఐలు అనూష, రాజశేఖర్ పాల్గొన్నారు.
కాల్వశ్రీరాంపూర్, (ఆంధ్రజ్యోతి): కాల్వ శ్రీరాంపూ ర్ పోలీస్‌స్టేషన్‌లో ఓపెన్‌హౌస్ నిర్వహించారు. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థినులు పాల్గొన్నారు. ఎస్సై గట్ల సుధాకర్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు నిర్వహించే విధులు, ఫిర్యాదుల స్వీకరణ, కేసుల నమోదు, దర్యాప్తు వివరించారు. ఏఎస్సై నీలిమ, రిసెప్షనిస్ట్ రజిని, రైటర్ జ్యోతి, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.