సమాజ నిర్మాణంలో విశ్వకర్మల పాత్ర కీలకం
ABN , Publish Date - Sep 18 , 2026 | 12:27 AM
కలెక్టరేట్ సమావేశ మం దిరంలో గురువారం యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవ వేడుకలో ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు, కలెక్టర్ కోయ శ్రీహర్ష, అద నపు కలెక్టర్ బి. శ్రీరాములు, డిసిపి రాంరెడ్డి విశ్వకర్మ చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పెద్దపల్లి కల్చరల్, సెప్టెంబరు17(ఆంధ్రజ్యోతి): కలెక్టరేట్ సమావేశ మం దిరంలో గురువారం యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవ వేడుకలో ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు, కలెక్టర్ కోయ శ్రీహర్ష, అద నపు కలెక్టర్ బి. శ్రీరాములు, డిసిపి రాంరెడ్డి విశ్వకర్మ చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ విప్ మాట్లాడుతూ, సమాజ నిర్మాణంలో విశ్వకర్మల పాత్ర ఎంతో కీలకమన్నారు. ప్రాచీన కాలం నుంచి తమ నైపుణ్యం, శ్రమ, సృజనాత్మకతతో సమాజ అభివృద్ధికి విశ్వక ర్మలు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని తెలిపారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విశ్వకర్మ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రాచీన కాలం నుంచే విశ్వకర్మలు అద్భుతమైన నైపుణ్యంతో కళలు, వృత్తులు, నిర్మాణ రం గాలకు విశిష్ట సేవలు అందించారని తెలిపారు. విశ్వకర్మల సంక్షేమం, అభి వృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, పాల్గొన్నారు.