విద్యాప్రగతిలో తల్లిదండ్రుల పాత్ర కీలకం
ABN , Publish Date - Jul 19 , 2026 | 12:05 AM
విద్యార్థుల విద్యా ప్రగతిలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని, తల్లిదండ్రులు తప్పనిసరిగా భాగస్వా ములు కావాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం తుర్కల మద్దికుంట ఎంపీపీఎస్ పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పెద్దపల్లి రూరల్, జూలై 18 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల విద్యా ప్రగతిలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని, తల్లిదండ్రులు తప్పనిసరిగా భాగస్వా ములు కావాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం తుర్కల మద్దికుంట ఎంపీపీఎస్ పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశా లల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. తుర్కలమద్దికుంట ఎంపీపీఎస్ పాఠశాలలో ప్రహరీ నిర్మాణం పూర్త యిందని, జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన పనులను ఆరు నెలల్లో పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను పెంచడంపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. తల్లిదండ్రులు తప్పనిసరిగా పేరెంట్స్ - టీచర్ సమావేశాలకు హాజరై పిల్లల చదువు, ప్రగతి గురించి ఉపాధ్యాయులను తెలుసుకోవాలని సూచించారు. విద్యార్థులు రోజూ క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా తల్లిదండ్రులు చూడాలన్నారు. ఏదైన కార ణంతో కొద్ది రోజులు పాఠశాలకు రాలేకపోతే వెంటనే ఉపాధ్యాయులకు సమాచారం అందించాలని, తద్వారా వారు వినని పాఠాలను ప్రత్యేకంగా బోధించే అవకాశం ఉంటుందన్నారు. కొంత సమయం పిల్లలతో గడ పాలని, పాఠశాలలో ఏమి నేర్చుకున్నారో, హోంవర్క్ ఇచ్చారా అని అడిగి తెలుసుకోవాలన్నారు. తల్లిదండ్రులు ఎప్పుడైనా పాఠశాలకు వచ్చి తమ పిల్లల విద్యాపురోగతి, ప్రవర్తన గురించి ఉపాధ్యాయులను సంప్రదిం చవచ్చని కలెక్టర్ తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, జిల్లా యం త్రాంగం సమిష్టిగా పనిచేస్తే ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడంతోపాటు విద్యార్థులను అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి తీసుకెళ్ల వచ్చని పేర్కొన్నారు. ప్రథమ్ స్వచ్ఛంధ సంస్థ ద్వారా లైబ్రరీ మెటీరియల్ వితరణ చేయగా కలెక్టర్ చేతుల మీదుగా పాఠశాలకు అందించారు. జిల్లా విద్యాధికారి శారద, జీసీడీవో కవిత, సర్పంచ్ రాజయ్య, ఉప సర్పంచ్ తిరుపతి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ కీర్తన, పాఠశాల ప్రధా నోపాధ్యాయులు మంజులత, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.