Share News

కార్మికుల ప్రయోజనాల కోసమే సింగరేణి గర్జన

ABN , Publish Date - Oct 12 , 2026 | 12:09 AM

సింగరేణి సంస్థను, కార్మికుల ప్రయోజనాలను కాపాడుకోవటానికి బీఆర్‌ఎస్‌ పార్టీ పోరాటం చేస్తుం దని మాజీ ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన నియోజక వర్గ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో సుమన్‌ మాట్లాడుతూ.. బడేబాయ్‌ నరేంద్ర మోదీ, చోటే బాయ్‌ రేవంత్‌రెడ్డి, మిడిల్‌బాయ్‌ కిష న్‌రెడ్డి ముగ్గురు కలిసి సింగరేణి సంస్థను నిర్వీర్యం చేస్తున్నారన్నారు.

కార్మికుల ప్రయోజనాల కోసమే సింగరేణి గర్జన

మంథని, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): సింగరేణి సంస్థను, కార్మికుల ప్రయోజనాలను కాపాడుకోవటానికి బీఆర్‌ఎస్‌ పార్టీ పోరాటం చేస్తుం దని మాజీ ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన నియోజక వర్గ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో సుమన్‌ మాట్లాడుతూ.. బడేబాయ్‌ నరేంద్ర మోదీ, చోటే బాయ్‌ రేవంత్‌రెడ్డి, మిడిల్‌బాయ్‌ కిష న్‌రెడ్డి ముగ్గురు కలిసి సింగరేణి సంస్థను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. తెరవెనుక చర్చలు జరుపుతూ సంస్థలో రాష్ట్ర వాటాను అమ్ముదామనే ఆలోచన చేస్తున్నారన్నారు. రెండేళ్ల కాలంలోనే సింగరేణి సంస్థను నాశనం చేశారన్నారు. గతంలో కేసీఆర్‌ సింగరేణి సంస్థను విస్తరింప జేయాలనే ఆలోచన చేశారన్నారు. సంస్థను గ్లోబల్‌ ఆర్గనైజేషన్‌ చేయాలని చూస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం జేబు సంస్థగా మార్చుకున్నా రన్నారు. ఇందులో అందరూ వాటాదారులేని, సీఎంతో సహా మంత్రులు శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌, వివేక్‌లకు వాటాలు ఉన్నందునే వారు మాట్లాడటం లేదన్నారు. కార్మికుల ప్రయోజనాలను కాపాడటం, సంస్థను పరిరక్షించుకోవటానికి బీఆర్‌ఎస్‌ పార్టీ పోరాటం చేస్తుందని, ఇందులో భాగంగా ఈనెల 14న రామగుండంలో బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బహిరంగ సభ పెట్టినట్లు తెలిపారు. సభ ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి కార్మికులకు మేలు చేయాల న్నదే లక్ష్యమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు మెడికల్‌ బోర్డు పెట్టలేదన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో జీవో నెం. 76 ద్వారా 35 వేల కుటుంబాలకు స్థలాలు ఇచ్చామని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వంలో ఒక్కరికి పట్టా ఇవ్వలేదన్నారు. ఎన్నికల్లో కార్మికుల ఓట్ల కోసం అనేక హమీలు ఇచ్చా రని, అందులో ఒక్కటి అమలు చేయకుండా కార్మిక లోకాన్ని మోసం చేశారన్నారు. సింగరేణి లాభాల్లో వాటా ఇచ్చిన చరిత్ర కేసీఆర్‌ దేనని, ప్రస్తుతం లాభాల్లో వాటా చూపిస్తూ కోత విధిస్తున్నారన్నారు. సింగ రేణి కార్మిక గర్జనకు భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయా లని కోరారు. ఈకార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నేతలు పాల్గొన్నారు.

Updated Date - Oct 12 , 2026 | 12:09 AM