ఓటు హక్కుతోనే సమాజంలో విలువ
ABN , Publish Date - Jul 12 , 2026 | 11:49 PM
బడుగు, బలహీన వర్గాలంతా ఓటు హక్కుతోనే అందరితో సమానంగా గౌరవించబడుతున్నారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. సర్ ప్రోగాంలో భాగంగా మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్‌నగర్‌లో ఓటర్లకు ఓటు హక్కు పై పుట్ట మధు ఆదివారం అవగాహన కల్పించారు.
మంథని, జూలై 11 (ఆంధ్రజ్యోతి): బడుగు, బలహీన వర్గాలంతా ఓటు హక్కుతోనే అందరితో సమానంగా గౌరవించబడుతున్నారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. సర్ ప్రోగాంలో భాగంగా మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్‌నగర్‌లో ఓటర్లకు ఓటు హక్కు పై పుట్ట మధు ఆదివారం అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఓటు హక్కు లేకపోతే సమాజంలో విలువలేదన్నారు. దళిత వాడలకు సైతం పెద్దోళ్ళు వస్తున్నారంటే దానికి ఓటు హక్కు కారణమన్నారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించడకుండా చూడాల్సిన బాధ్యత బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులపై ఉందన్నారు. అధికారుల లెక్కల ప్రకారం 30 శాతం వరకు పూర్తి అయినట్లు తెలుస్తుందన్నారు. అర్హులంందరి ఓట్ల సంరక్షణకు బీఎల్‌వో, బీఎల్‌ఏలు సమన్వయంతో పని చేయాలన్నారు. ఏగోళపు శంకర్‌గౌడ్, తగరం శంకర్‌లాల్, పుప్పాల తిరుపతి, కనవేన శ్రీనివాస్, వేల్పుల గట్టయ్య, లోడారి రాములు, కుమార్, యాకూబ్‌లు పాల్గొన్నారు.