Share News

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కట్టుదిట్టంగా అమలు చేయాలి

ABN , Publish Date - Mar 23 , 2026 | 11:46 PM

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రతీ శాఖకు సంబంధించిన అధికారులు కట్టుదిట్టంగా అమలు చేయాలి కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. సోమవారం కలెక్ట రేట్‌లో 99 రోజుల కార్యాచరణపై అదనపు కలెక్టర్‌ డి.వేణు, అధికారులతో కలిసి నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు.

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కట్టుదిట్టంగా అమలు చేయాలి

పెద్దపల్లి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రతీ శాఖకు సంబంధించిన అధికారులు కట్టుదిట్టంగా అమలు చేయాలి కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. సోమవారం కలెక్ట రేట్‌లో 99 రోజుల కార్యాచరణపై అదనపు కలెక్టర్‌ డి.వేణు, అధికారులతో కలిసి నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది కదలికలపై జిల్లా అధికారులు పక్కా నిఘా ఉంచాలన్నారు. పెండింగ్‌ ఫైల్స్‌ సత్వర పరిష్కారం ఆశించిన పురోగతి సాధించ లేదని అన్నారు. ప్రతీ కార్యాలయం సంబంధించి పెండింగ్‌ ఫైల్స్‌ డిస్పోజల్‌ వివరాలతో కూడిన రిపోర్ట్‌ అందించాలన్నారు. జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో విద్యా సంస్థలను తనిఖీ చేస్తూ పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేయాలన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ప్రభుత్వ విప్‌గా నియమితులయ్యారని, ప్రొటోకాల్‌ ప్రకారం ఎంపీ, ఎమ్మెల్యేల కంటే ప్రభుత్వ విప్‌ ముందు ఉంటారని, అభివృద్ధి పనులకు సంబంధిం చి శిలా ఫలకాలు ఏర్పాటు చేసే సమయంలో ఒకసారి రెవెన్యూ అధికారులతో మాట్లాడి ఫైనల్‌ చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. గ్రామాలలో పారిశుధ్య నిర్వహణ మెరుగ్గా జరిగేలా చర్యలు తీసుకోవా లని కలెక్టర్‌ పంచాయతీ అధికారికి సూచించారు. 263 గ్రామ పంచా యతీలకు శాస్త్రవేత్తలతో కూడిన 10 బృందాలు పర్యటించి పంట మార్పిడి విధానం, ఆధునిక సాగు పద్ధతులు, యూరియా వాడకం తగ్గిం పు వంటి పలు అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశించారు. వైద్యశాఖ పరిధిలో ఏప్రిల్‌ 6 నుంచి 11 వరకు చేపట్టే కార్యక్రమాల్లో భాగంగా రామగుండం క్రిటికల్‌ కేర్‌ సెంటర్‌, నంది మేడారం కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ ప్రారంభించేందుకు చర్యలు తీసు కోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 23 , 2026 | 11:47 PM