ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
ABN , Publish Date - Mar 28 , 2026 | 11:28 PM
తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక డిప్యూటీ చైర్మన్ తోడేటి శంకర్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ బొడ్డు రవీందర్ ఆరోపిం చారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమా వేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిందన్నారు.
కళ్యాణ్‌నగర్, మార్చి 28(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక డిప్యూటీ చైర్మన్ తోడేటి శంకర్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ బొడ్డు రవీందర్ ఆరోపిం చారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమా వేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిందన్నారు. న్యాయస్థా నాలు చెప్పినప్పటికీ ఇప్పటి వరకు ఉద్యమకారులకు బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించక పోవడం బాధాకరమన్నారు. ఉద్యమకారులకు 250చదరపు గజాల ఇంటి స్థలం, ఇల్లు కట్టుకోవడానికి రూ.10లక్షల ఆర్థిక సహాయం, ఆర్‌టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి పాస్ ఇస్తామని చెప్పారని, ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్టులకు రిజర్వేషన్లు, విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఉద్యమకారుల పిల్లలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి కాలయాపన చేస్తుందని ఆయన ఆరోపించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఉద్యమకారుల కోసం కమిటీ వేస్తామని వేయలేదని, అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యమకారుల కోసం మాట్లాడకపోతే జూన్ 2వరకు వేచి చూసి అనంతరం ఆందోళన చేస్తామని హెచ్చరించారు. రాగం శ్రీను, పొన్నం విజయ్, అనుముల కళావతి, శాంత లక్ష్మి, తోడేటి స్వరూప, అనిత చౌదరి, కేతమ్మ, కనకలక్ష్మి, స్వాతి, దాసరి ఎల్లయ్య, వీరాలాల్, రమేష్, మల్లేష్ పాల్గొన్నారు.