Share News

ఆటో డైవర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి

ABN , Publish Date - Apr 04 , 2026 | 11:25 PM

గత అసెంబ్లీ ఎన్నికల సంద ర్భంగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను విస్మ రించారని, ఇప్పటికైనా హామీలను అమలు చేసి ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్‌ అన్నారు.

ఆటో డైవర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి

సుల్తానాబాద్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): గత అసెంబ్లీ ఎన్నికల సంద ర్భంగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను విస్మ రించారని, ఇప్పటికైనా హామీలను అమలు చేసి ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్‌ అన్నారు. సుల్తానాబాద్‌లో శనివారం ఆటో జేఏసీ నేతలతో సమావేశం నిర్వహిం చారు. సీఎం రేవంత్‌రెడ్దితో సహా మంత్రి శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభా కర్‌లు మాట ఇచ్చి మోసం చేశారన్నారు. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డుతో పాటు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొన్నారని, ఇందుకు శ్రీధర్‌బాబు బాధ్యత వహిం చాలన్నారు. బడ్జెట్‌లో ఆటో డ్రైవర్లకు ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెడతా మని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్‌ మోసం చేశారన్నారు. ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని ఆటో డ్రైవర్లకు సూచించారు. జిల్లా అధ్యక్షుడు రేణికుంట సురేష్‌, ఉపాధ్యక్షుడు ఎలగందుల నాంపల్లి, ఆనం ద్‌, దేశెట్టి రమేష్‌, వినయ్‌, స్వామి, వరుణ్‌, సదానందం పాల్గొన్నారు.

Updated Date - Apr 04 , 2026 | 11:25 PM