Share News

పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Feb 24 , 2026 | 12:18 AM

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరి ష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు డిమాండ్‌ చేశారు. కలెక్టరెట్‌ ఎదుట ధర్నా చేపట్టి కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.

పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

పెద్దపల్లిటౌన్‌, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరి ష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు డిమాండ్‌ చేశారు. కలెక్టరెట్‌ ఎదుట ధర్నా చేపట్టి కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పంచాయతీ సిబ్బందిని పీఆర్సీ పరిధిలోకి తీసుకు రావాలని, గ్రీన్‌ఛానల్‌ ద్వారా వేతనాలు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుతూ గ్రామీణ ప్రాంతా లలో ఎలాంటి అంటువ్యాధులు, అనారో గ్యాలు రాకుండా ప్రజల ఆరోగ్యాలను కాపా డుతు పంచాయతీ కార్మికులు సేవలందిస్తు న్నారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం లోకి వస్తే గ్రామపంచాయతీ సిబ్బందికి ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు అందజే స్తామని, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చి అమలు చేయడం లేదన్నారు. యూనియన్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సీపెల్లి రవీందర్‌, ఎండి ఖాజా, జిల్లా ఉపాధ్యక్షుడు ఇరుగు రాల లచ్చయ్య, జంగపల్లి నరేష్‌, అశోక్‌, పైడిపల్లి నాగ య్య, సహాయ కార్యదర్శులు తిట్ల శ్రీనివాస్‌, వేల్పుల భాస్కర్‌, రెడ్డిమల్ల నాగేశ్వర్‌, శాతరాజుల గంగాధర్‌ ,జిల్లా కమిటీ సభ్యుల పాల్గొన్నారు.

Updated Date - Feb 24 , 2026 | 12:18 AM