విద్యుత్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
ABN , Publish Date - Apr 10 , 2026 | 11:46 PM
విద్యుత్ కార్మికుల డిమాండ్‌లను పరిష్కరించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం అన్నారు. శుక్రవారం రాఘవాపూర్ విద్యుత్ శాఖ డీఈ కార్యాలయం వద్ద ఆర్టిజన్స్ చేస్తున్న నిరసన కార్యక్రమానికి ఆయన సంఘీ భావం ప్రకటించారు.
పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 10 (ఆంఽధ్రజ్యోతి): విద్యుత్ కార్మికుల డిమాండ్‌లను పరిష్కరించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం అన్నారు. శుక్రవారం రాఘవాపూర్ విద్యుత్ శాఖ డీఈ కార్యాలయం వద్ద ఆర్టిజన్స్ చేస్తున్న నిరసన కార్యక్రమానికి ఆయన సంఘీ భావం ప్రకటించారు. అనంతరం సదానందం మాట్లా డుతూ యేడాదిగా అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకె ళ్ళినా పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కార్మికులు వారి సమస్యలకోసం సమ్మె చేస్తుంటే ప్రభు త్వం పరిష్కరించక పోగా వారిపై ఎస్మా ప్రయో గిస్తామని బెదిరింపులకు పాల్పడడం హేయమైన చర్య అన్నారు. సమస్యలను త్వరగా పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. కల్లె పల్లి నవీన్, చంద్రగిరి సతీష్, నాగరాజు, మల్లేష్, ఓదెలు ఉండగా సమ్మెలో విద్యుత్ ఽఽశాఖ కార్మికుల జేఏసీ జిల్లా చైర్మన్ కిషన్‌రెడ్డి, ఇరుగురాల రమేష్, ఎల్లయ్య, నర్సయ్య, పాల్గొన్నారు.
అంతర్గాం, (ఆంధ్రజ్యోతి): ఆర్టిజన్, అన్‌మ్యాన్డ్ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు భిక్షపతి కోరారు. రామగుం డంలోని మల్యాలపల్లి సబ్‌స్టేషన్ ఎదుట కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా నిలిచారు. సమ్మె శిబిరం వద్ద వంటావార్పు చేపట్టి నిరసన తెలిపారు. జిల్లా ఉపాధ్యక్ష, కోశాధికా రులు భిక్షపతి, రామాచారి మాట్లా డుతూ విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న ఆర్టిజన్లను ఏపీఎస్‌సీబీ రూల్స్ ప్రకారం ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. పీసు రేటు కార్మికులకు జీవో 11 ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలన్నారు. జేఏసీ నాయకులు విశ్వనాథ్, వడ్డేపల్లి సురేష్ పాల్గొన్నారు.
ఒకే సంస్థలో రెండు చట్టాలను అమలు చేస్తూ ఆర్టిజన్ల పట్ల వివక్షను చూపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం చర్యలను ఖండిస్తున్నామని, వారి డిమాండ్లను నెరవే ర్చాలని రామగుండం బీజేపీ ఇన్‌చార్జి కందుల సంధ్యా రాణి అన్నారు. ఆర్టిజన్ల సమ్మెకు మద్దతుగా నిలిచారు. ఆమె మాట్లాడుతూ 20 వేల కుటుంబాల భవిష్యత్‌తో రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ శాఖ చెలగాటమాడు తున్నా రని, వారిని రోడ్డుమీద పడవేసే ఎలాంటి చర్యలైనా వారికి మద్దతుగా నిలబడి పోరాడుతామని ఆమె అన్నారు. గుండబోయిన భూమయ్య, అంకరి భరత్, పరకాల మురళి, పాల్గొన్నారు.