Share News

నిరుద్యోగ సమస్య పరిష్కరించాలి

ABN , Publish Date - Oct 18 , 2026 | 12:04 AM

నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం పెద్దపల్లి పట్టణం లోని బస్టాండ్‌ చౌరస్తాలో రాజీవ్‌ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం నాయకులు రామగిరి అఖిల్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువతీ యువకులు నోటిఫికేషన్లు రాక, ఉద్యోగాలు లభించక తీవ్ర నిరాశా నిస్పృహల్లో ఉన్నారన్నారు.

నిరుద్యోగ సమస్య పరిష్కరించాలి

పెద్దపల్లి రూరల్‌ , అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం పెద్దపల్లి పట్టణం లోని బస్టాండ్‌ చౌరస్తాలో రాజీవ్‌ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం నాయకులు రామగిరి అఖిల్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువతీ యువకులు నోటిఫికేషన్లు రాక, ఉద్యోగాలు లభించక తీవ్ర నిరాశా నిస్పృహల్లో ఉన్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రకటనలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు పోరాటాన్ని ఆపేది లేదన్నారు. నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. బీజేపీ జిల్లా కార్యదర్శి శివంగారి సతీష్‌, అనిల్‌ రావు, శివంగారి రాజేష్‌, శివసాయి, సాయి సతీష్‌, గడసి సతీష్‌, రేండ్ల వేణు, రాజేందర్‌ రెడ్డి, బొడ్డుపల్లి శ్రీను, కిరణ్‌, చందు, రాకేష్‌, ఆకాష్‌, బండి శ్రవణ్‌, వేముల శ్రవణ్‌, నవీన్‌, బియ్యపు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 18 , 2026 | 12:04 AM