Share News

కరెంట్‌ చార్జీల పెంపు యోచనను విరమించుకోవాలి

ABN , Publish Date - Oct 16 , 2026 | 11:54 PM

రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల నుండి ట్రూ అప్‌ చార్జీల రూపంలో కరెంట్‌ చార్జీలు పెంచాలని చేస్తున్న యోచనను విరమించుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం హెచ్చరించారు. శుక్రవారం భాస్కర్‌రావు భవన్‌లో నగర కార్యవర్గ సమా వేశంలో మాట్లాడారు.

కరెంట్‌ చార్జీల పెంపు యోచనను  విరమించుకోవాలి

గోదావరిఖని, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల నుండి ట్రూ అప్‌ చార్జీల రూపంలో కరెంట్‌ చార్జీలు పెంచాలని చేస్తున్న యోచనను విరమించుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం హెచ్చరించారు. శుక్రవారం భాస్కర్‌రావు భవన్‌లో నగర కార్యవర్గ సమా వేశంలో మాట్లాడారు. ప్రతి యూనిట్‌ విద్యుత్‌ వినియోగంపై అదనంగా 30పైసలు వసూలు చేయాలని చూస్తున్నదని ఆయన పేర్కొన్నారు. అలాగే డిసెంబర్‌ నుంచి 50పైసలు అదనంగా వసూలు చేయాలని చూడడం హేయమైన చర్య అని ఆరోపించారు. ట్రూ అప్‌ మొత్తం 7,635 కోట్ల రూ పాయల భారాన్ని ప్రజలపై మోపాలని చూస్తే సీపీఐ చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు. శనిగరపు చంద్ర శేఖర్‌, గోసిక మోహన్‌, కనకరాజ్‌, మార్కపురి సూర్య, తాళ్లపెల్లి మల్లయ్య, శంకర్‌, పాల్గొన్నారు.

Updated Date - Oct 16 , 2026 | 11:54 PM