పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి
ABN , Publish Date - Jun 19 , 2026 | 12:29 AM
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపుతోపాటు విద్యా ప్రమాణాల మెరుగుదలకు ప్రతీ ఒక్క ఉపాధ్యాయుడు కృషి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులు, మండల విద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు.
పెద్దపల్లి కల్చరల్, జూన్18(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపుతోపాటు విద్యా ప్రమాణాల మెరుగుదలకు ప్రతీ ఒక్క ఉపాధ్యాయుడు కృషి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులు, మండల విద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన ఉపాధ్యాయులు, సిబ్బంది అందు బాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గత విద్యా సంవత్సరంలో పని చేసిన విద్యా వలంటీర్ల సేవలను కొనసా గిస్తామని పేర్కొన్నారు. అవసరమైతే స్థానికంగా విద్యావలంటీర్లను నియమించేందుకు ప్రతిపాదనలు పంపాలన్నారు. ఉపాధ్యాయులంతా ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా హాజరు నమోదు చేయాలన్నారు. ఉపాధ్యాయుల సెలవుల మంజూరు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహించాలన్నారు. బడిబాటను సమర్ధవంతంగా నిర్వహించాలని, జిల్లాలో మొత్తం 3 వేల మంది కొత్త విద్యార్థులను చేర్పించాలని, ప్రతి మండలానికి 300 మంది విద్యార్థులు చేరడమే లక్ష్యంగా కృషి చేయాలన్నారు. జిల్లాలో 15 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న 120 పాఠశాలలు, సున్నా నమోదు 35 పాఠశాలలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. అలాగే మోడల్‌స్కూల్‌లో విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నదని, పరిస్థితిని మార్చేం దుకు ప్రత్యేక కార్యచరణ తీసుకోవాలన్నారు. ప్రతీ విద్యార్థికి ఆధార్ నెంబర్ జనరేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని, యూడైస్ వివరాలను నవీకరించాలని సూచించారు. కస్తూర్బా విద్యాలయంలో ఉన్న సీట్లను భర్తీ చేయాలన్నారు. ఉన్నత తరగతుల విద్యార్థులకు వారానికి ఓసారి పోటీ పరీక్షల శిక్షణకు ఆన్ అకాడమీ, ఫిజిక్స్ వాటా లాంటి డిజిటల్ విద్యావేదికల ద్వారా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాల కోసం పది రోజుల్లో కంప్యూటర్ ఇంటర్నెట్ ఇతర వనరులను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ప్రతీ శనివారం కాంప్లెక్స్ హెచ్‌ఎంలు సమీక్ష నిర్వహించాలన్నారు. పాఠశాలల్లో వసతుల సమ స్యలను పరిష్కరించేందుకు వచ్చే 45 రోజులు ప్రాథమిక విద్యార్థుల అభ్యాస నైపుణ్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లాలో ని 48 ప్రీ ప్రైమరీ పాఠశాలలకు అవసరమైన నియామక ప్రక్రియ పూర్తయ్యిందని, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రత్యేక అవసరాలు ఉన్న చిన్నారులను భవిత కేంద్రాల్లో చేర్పించాల న్నారు. విధులు సక్రమంగా నిర్వహించని ఉపాధ్యాయులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అకడమిక్ మానిటరింగ్ అధికారి షేక్‌తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలి
ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ కోయశ్రీహర్ష తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, ఆయూష్ విభాగం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అనే కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేస్తుందన్నారు.ఈ నెల 21 ఆదివారం ఉదయం 6 గంటలకు ప్రారంభం కానున్నదని, పాల్గొనే వారు ఉదయం 5.45 గంటలకు వేదికకు చేరుకోవాలని వివరించారు.