రైస్‌మిల్లుల్లో హమాలీల సంఖ్య పెంచాలి
ABN , Publish Date - May 09 , 2026 | 11:40 PM
సుల్తానాబాద్ ప్రాంతంలోని రైస్ మిల్లుల్లో శనివారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మిల్లర్లు ధాన్యం అన్‌లోడింగ్‌ను వేగవంతం చేసేలా వారితో కలెక్టర్ మాట్లాడారు. వర్షాల నేపథ్యంలో అన్ని ముందస్తు ఏర్పా ట్లు చేసుకోవాలని హెచ్చరించారు.
సుల్తానాబాద్, మే 9 (ఆంధ్రజ్యోతి): సుల్తానాబాద్ ప్రాంతంలోని రైస్ మిల్లుల్లో శనివారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మిల్లర్లు ధాన్యం అన్‌లోడింగ్‌ను వేగవంతం చేసేలా వారితో కలెక్టర్ మాట్లాడారు. వర్షాల నేపథ్యంలో అన్ని ముందస్తు ఏర్పా ట్లు చేసుకోవాలని హెచ్చరించారు. ట్యాబ్ ఎంట్రీలు పూర్తి చేసి రైతులకు త్వరతిగతిన చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. సుల్తానాబాద్ ప్రాం తంలోని సాయితేజ రైస్‌మిల్లు, పూసాల పరిధిలోని కళ్యాణి, పరమేశ్వర, కాట్నపల్లిలోని గౌరీనాథ్, మమత, సదాలక్ష్మీ, లక్ష్మీగణపతి రైస్‌మిల్లులను కలెక్టర్ తనిఖీ చేశారు. మిల్లుల్లో అన్‌లోడింగ్, నిలువలు, ట్యాబ్ ఎంట్రీలు, ట్రక్ షీట్లు జనరేషన్ అంశాలను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లా డుతు హమాలీల సంఖ్య పెంచాలని, అన్‌లోడింగ్ చేయడాన్ని మరింత వేగవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఆయా కొనుగోలు కేంద్రాల నుంచి నాణ్యమైన ధాన్యం రైస్‌మిల్లులకు తరలిస్తున్న నేపథ్యంలో మిల్లుల వద్ద ఎలాంటి కోతలు విధించవద్దని మిల్లర్లతో స్పష్టం చేశారు. రైతులకు త్వరితగతిన చెల్లింపులు వారి బ్యాంకు ఖాతాలో జమ అయ్యేలా చూడాల న్నారు. రానున్న ఏడు రోజులలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, ధాన్యం తడవకుండా కేంద్రాలలో రైస్‌మిల్లులలో ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. గన్నీబ్యాగులు, టార్పాలిన్ కవర్లు సరిపడా ఉంచాలని, అవసరమైన రవాణా వాహనాలు అందుబాటులో ఉంచుకోవా లని సూచించారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధకారి శ్రీనాథ్, మిల్లర్లు అధికారులు పాల్గొన్నారు.