Share News

అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్యను పెంచాలి

ABN , Publish Date - Apr 14 , 2026 | 12:26 AM

అంగన్‌వాడీ టీచర్లు ప్రత్యేక చొరవ తీసుకొని కేంద్రాల్లో పిల్లల సంఖ్యను పెంచే విధంగా కృషి చేయాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్‌ఆర్‌ గార్డెన్స్‌లో సోమవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఎనిమిదవ పోషణ పక్షం 2026 కార్యక్రమంలో పాల్గొని పలువురు మహిళలకు ప్రభుత్వం తరుపున అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్‌ ఫోన్లు పంపిణీ చేశారు.

అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్యను పెంచాలి

పెద్దపల్లి, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ టీచర్లు ప్రత్యేక చొరవ తీసుకొని కేంద్రాల్లో పిల్లల సంఖ్యను పెంచే విధంగా కృషి చేయాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్‌ఆర్‌ గార్డెన్స్‌లో సోమవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఎనిమిదవ పోషణ పక్షం 2026 కార్యక్రమంలో పాల్గొని పలువురు మహిళలకు ప్రభుత్వం తరుపున సీమంతం చేసి వారిని ఆశీర్వదించి 304 మంది అంగన్‌వాడీ టీచర్లకు రూ. 42.28 లక్షల విలువ గల స్మార్ట్‌ ఫోన్లు పంపిణీ చేశారు. అలాగే 13 మంది దివ్యాంగులకు రూ.8.60 లక్షల విలువ గల ల్యాప్‌టాప్స్‌, ట్యాబ్స్‌ పంపిణీ, నియోజవర్గంలోని 513 మంది లబ్ధిదారులకు రూ.1.62 కోట్ల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక ఊరట అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వసతులు, పూర్తి స్థాయిలో డాక్టర్లు, మందులు, కార్పొరేట్‌ స్థాయిలో సేవలు అందించి రాష్ట్రంలోనే గుర్తింపు తెచ్చుకున్నదన్నారు. ప్రజలు అన్ని వైద్య సేవలకు ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఒకవేళ ఈ ఆసుపత్రిలో సేవలకంటే మెరుగైన వైద్య సేవలు అవసరమైన పక్షంలో హైదరాబాద్‌లోని నిమ్స్‌లో వైద్య సేవలు అందించే బాధ్యత తనదన్నారు. దివ్యాంగులకు ల్యాప్‌టాప్స్‌, టాబ్స్‌ పంపిణీ చేసి వారి జీవనోపాధికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు గుర్తు చేశారు. అంగన్‌వాడీ టీచర్లు, కాంగ్రెస్‌ కార్యకర్తలు గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుకొనే పిల్లల సంఖ్యను పెంచి వారికి మరింత మెరుగైన విద్య అందించాలని కోరారు. ఇప్పటికే అంగన్వాడీ టీచర్లు నిబద్ధతతో పనిచేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహిస్తూ మత శిశు సంక్షేమానికి తోడ్పాటును అందిస్తున్నారని చెప్పారు. గ్రామస్థాయిలో ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందించడమే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఉద్ధేశమని ఆయన స్పష్టం చేశారు. తాను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత నుంచి 17 కోట్ల పైచిలుకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ పేద ప్రజలకు అందజేశామని గుర్తు చేశారు. నిమ్స్‌లో వైద్య ఖర్చులకు సహాయంగా 9 కోట్ల విలువైన ఎల్‌ఓసీ చెక్కులను అందజేశామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. సంక్షేమ శాఖ జిల్లా అధికారి వేణుగోపాల్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతటి అన్నయ్య గౌడ్‌, సుల్తానాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌ బిరుదు రాధాకృష్ణ, వైస్‌ చైర్మన్లు ముస్కాన్‌ నాజ్‌ నయ్యర్‌, అంతటి పుష్పలత, కౌన్సిలర్లు, వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్లు, డైరెక్టర్లు, పలు గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2026 | 12:26 AM