Share News

అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా చూడాలి

ABN , Publish Date - Nov 29 , 2026 | 11:05 PM

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని, అర్హులైన ఓటర్ల పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా ఏఎస్‌డీడీ జాబితాలను ప్రతి బూత్‌ స్థాయిలో క్షుణంగా పరిశీలించాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు సూచించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సూచన మేరకు ఆదివారం మంత్రి క్యాంపు ఆఫీసులో నిర్వహించిన ఓట్‌ బచావో-దేశ్‌ బచావో ఫేజ్‌-3 ఓట్‌ రక్షక్‌ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్‌ సింగ్‌ రాజ్‌ ఠాకూర్‌ కలిసి శ్రీనుబాబు పాల్గొన్నారు.

అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా చూడాలి

మంథని, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని, అర్హులైన ఓటర్ల పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా ఏఎస్‌డీడీ జాబితాలను ప్రతి బూత్‌ స్థాయిలో క్షుణంగా పరిశీలించాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు సూచించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సూచన మేరకు ఆదివారం మంత్రి క్యాంపు ఆఫీసులో నిర్వహించిన ఓట్‌ బచావో-దేశ్‌ బచావో ఫేజ్‌-3 ఓట్‌ రక్షక్‌ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్‌ సింగ్‌ రాజ్‌ ఠాకూర్‌ కలిసి శ్రీనుబాబు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి అర్హుడికి ఓటు హక్కు దక్కేలా బీఎల్‌వోలు, వలంటీర్లు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఐయాం ఓటు రక్షక్‌ కార్యక్రమంపై అవగాహన కల్పించాలన్నారు. ఓటు హక్కు పరిరక్షణతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలైన చేయూత పెన్షన్‌, మహాలక్ష్మి, రైతుభరోసా, రుణ మాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, బీమా, ఉచిత కరెంట్‌, అల్పాహారం, యంగ్‌ ఇండియా స్కూల్స్‌ లాంటి పథకాలను ప్రజలకు చేరవేయడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ శ్రేణులు కృషి చేయాలన్నారు. మక్కాన్‌సింగ్‌ మాట్లాడుతూ మంత్రి శ్రీధర్‌ బాబు మంథని నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. కాంగ్రెస్‌ శ్రేణులు సమన్వయంతో సమిష్టిగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ నేతలు ఐలి ప్రసాద్‌, శశిభూషన్‌ కాచే, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ముస్కుల సహేందర్‌రెడ్డి, తిరుపతియాదవ్‌, ఉప్పట్ల శ్రీనివాస్‌, సెగ్గెం రాజేష్‌, వైనాల రాజులు పాల్గొన్నారు.

Updated Date - Nov 29 , 2026 | 11:05 PM