Share News

మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి

ABN , Publish Date - Apr 03 , 2026 | 11:42 PM

మహనీయుల జీవితాల నుంచి వ్యక్తిత్వ వికాస పాఠాలు నేర్చుకోవాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. మాజీ స్పీకర్‌ దివంగత దుద్దిళ్ళ శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా శుక్రవారం మండలంలో పుష్పగిరి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం, శస్త్ర చికిత్స కార్యక్రమాన్ని నిర్వహిం చారు.

మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి

ముత్తారం, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): మహనీయుల జీవితాల నుంచి వ్యక్తిత్వ వికాస పాఠాలు నేర్చుకోవాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. మాజీ స్పీకర్‌ దివంగత దుద్దిళ్ళ శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా శుక్రవారం మండలంలో పుష్పగిరి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం, శస్త్ర చికిత్స కార్యక్రమాన్ని నిర్వహిం చారు. కలెక్టర్‌ శ్రీహర్ష, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు హాజరయ్యారు. శ్రీపాదరావు చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన ధన్వాడలో పుట్టి శాసనసభ స్పీకర్‌ స్థాయికి ఎదిగిన మహనీయులు శ్రీపాదరావు అని కొనియాడారు. శ్రీపాదరావు చూపిన మార్గంలోనే వారి కుటుంబ సభ్యులు అనేక సేవా కార్య క్రమాలు కొనసాగించడం అభినందనీయమని తెలి పారు. అనంతరం కలెక్టర్‌ కంటి పరీక్ష చేయించు కున్నారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ అంతటి అన్నయ్య గౌడ్‌, కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం, మండల అధ్యక్షుడు బాలాజీ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వైనాల రాజు, వైస్‌చైర్మన్‌ మద్దెల రాజయ్య, మహిళా మండల అధ్యక్షురాలు పద్మ ఆనంద్‌, మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు వాజీద్‌ పాషా, మాజీ జడ్పిటిసి జగన్మోహన్‌ రావు, కిసాన్‌ సెల్‌ మండల అధ్యక్షుడు గాదం శ్రీనివాస్‌, బీసీ సెల్‌ మండల అధ్యక్షుడు అల్లం కుమారస్వామి, పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2026 | 11:42 PM