మహనీయుల జీవితాలు ఆదర్శంగా తీసుకోవాలి
ABN , Publish Date - Mar 02 , 2026 | 11:52 PM
మహనీయుల జీవితాల నుంచి మనం అనేక వ్యక్తిత్వ వికాస పాఠాలను నేర్చుకోవచ్చని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో శ్రీపాదరావు జయంతి వేడుకలను డీసీపీ రాంరెడ్డి, పలు శాఖల జిల్లా అధికారులతో కలిసి నిర్వహించారు.
పెద్దపల్లి కల్చరల్, మార్చి2 (ఆంధ్రజ్యోతి): మహనీయుల జీవితాల నుంచి మనం అనేక వ్యక్తిత్వ వికాస పాఠాలను నేర్చుకోవచ్చని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో శ్రీపాదరావు జయంతి వేడుకలను డీసీపీ రాంరెడ్డి, పలు శాఖల జిల్లా అధికారులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మారుమూల ప్రాంతమైన దన్వాడలో పుట్టిన ఆయన ఉమ్మడి రాష్ర్టానికి శాసనసభ స్పీకర్‌గా ఎదిగిన మహనీయుడని కొనియాడారు. న్యాయవాద వృత్తిని కొనసాగిస్తున్న సమయంలో ప్రజల కోరిక మేరకు రాజకీయాల్లోకి వచ్చి సర్పంచ్ స్థాయి నుంచి స్పీకర్ స్థాయికి చేరుకోవడం అసమాన్యమైన విషయమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక మంది స్థానిక నాయకుల జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కలెక్టరేట్ పాలన అధికారి ప్రకాష్, జిల్లా యువజన క్రీడాకాధికారి సురేష్, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.