కమీషన్ల కోసమే కాళేశఽ్వరం ప్రాజెక్ట్
ABN , Publish Date - Jul 07 , 2026 | 11:38 PM
కమీషన్ల కోసమే కాళే శ్వరం ప్రాజెక్టు డిజైన్ మార్చి బీఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున దోచుకుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు పేర్కొన్నారు. నందన గార్డెన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
పెద్దపల్లి టౌన్, జూలై 7 (ఆంఽధ్రజ్యోతి): కమీషన్ల కోసమే కాళే శ్వరం ప్రాజెక్టు డిజైన్ మార్చి బీఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున దోచుకుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు పేర్కొన్నారు. నందన గార్డెన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాలుగు రోజులుగా బీఆర్‌ఎస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ప్రాజెక్టులపై రైతులకు, ప్రజలకు విష ప్రచారాన్ని చేర వేస్తున్నారని, అవి ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నారో వారికి తెలుసన్నారు. రైతులకు నీరు అందించేందుకు పైపుల ద్వారా ఎత్తిపోసే అవసరం లేకుండానే తుమ్మిడిహెట్టిని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్‌రెడ్డి ఎల్లంపల్లికి నీరు తీసుకువచ్చే విధంగా రూపకల్పన చేశారన్నారు. బీఆర్‌ఎస్ ప్రభు త్వం లక్ష కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టును తమ స్వార్ధ ప్రయోజనాల కోసం నిర్మించిందన్నారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా నీళ్లను కింది నుంచి పైకి ఎత్తిపోసే ప్రాజెక్ట్ కేసీఆర్ ఇం జనీర్ అవతారం ఎత్తి నిర్మించారని, ఆ ప్రాజెక్టు నాలుగు నుంచి ఐదు సంవత్సరాలలో ఒక సంవత్సరానికి 180 టీఎంసీల చొప్పున నీళ్ళు ఎత్తిపోశారని, ఐదేళ్ళలో 900 టీఎంసీల నీటిని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల లిఫ్ట్‌ల ద్వారా ఎల్లంపల్లికి పంపిణీ చేసి అక్కడి నుంచి ఎత్తిపోసారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ మానస పుత్రిక అని, ప్రపంచంలో ఎనిమిదో వింత అని సొంత బస్సులలో రైతులను, ప్రజలను తరలించి టూరిజం ప్రాజెక్టుగా చూపించారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి వరద కాలువల ద్వారా కాళేశ్వరంతో సంబంధం లేకుండా 83 లక్షల మెట్రిక్ టన్నుల ధా న్యం పండిందన్నారు. ధాన్యం కొనుగోలు చేసి 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేసినట్లు వివరించారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు లేఖ ఇచ్చారన్నారు. హుస్సేనిమియా వాగులపై నిర్మించిన చెక్‌డ్యాములు సైతం కూలిపోయాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు నాగార్జునసాగర్, పులిచింతల, హుస్సేన్‌సాగర్, శ్రీశైలం, ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరు ఏకశిల ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభు త్వ హయాంలో నిర్మించామని, ఇప్పటికి చెక్కుచెదరలేదన్నారు. అబద్దాలను ప్రజలకు చెప్పడం మానేసి అవసరమైన సలహాలు సూచనలు అందించాలే తప్ప మోసపు మాటలు చెప్పడం మాను కోవాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని హరీష్‌రావు అబద్దాలు చెప్పారని, ఈ ప్రాంతానికి నీరు అందించిన దాఖలాలు లేవన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చించుదామంటే ఎవరు ముందుకు రావ డం లేదని, ఎక్కడ తప్పులు బయటపడుతాయని భయపడుతు న్నట్లు ప్రజలకు అర్ధం అవుతుందని ఆయన స్పష్టం చేశారు. మున్సిపల్ చైర్మన్ నూగిళ్ళ మల్లయ్య, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కూర మల్లారెడ్డి, గొపగాని సారయ్య, మందల సత్యనారాయణరెడ్డి, మినుపాల ప్రకాష్‌రావు, దామోదర్‌నాయక్, భూతగడ్డ సంపత్, సయ్యద్ మస్రత్, క్రాంతి, బొడ్డుపెల్లి శ్రీనివాస్, మంథెన నర్సింగ్, గుజ్జుల కుమార్, స్వరూప, సంతోష్ పాల్గొన్నారు.