కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో ఈ ప్రాంతానికి అన్యాయం
ABN , Publish Date - Nov 26 , 2026 | 12:05 AM
కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులే లబ్ధిపొందారే తప్ప, ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరగలేదని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. బుధవారం నంది రిజార్వయర్ వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ మంత్రి హరీష్‌రావు, కేటీఆర్‌లు రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఇష్టారీతిన మాట్లాడడం సరికాదన్నారు.
ధర్మారం, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులే లబ్ధిపొందారే తప్ప, ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరగలేదని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. బుధవారం నంది రిజార్వయర్ వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ మంత్రి హరీష్‌రావు, కేటీఆర్‌లు రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఇష్టారీతిన మాట్లాడడం సరికాదన్నారు. కేసీఆర్, హరీష్‌రావులు ఇంజనీర్ల అవతారమెత్తి, గజ్వెల్, సిరిసిల్ల, సిద్దిపేట ప్రాంతాలను బాగుచేసుకున్నారే తప్ప, ధర్మపురి నియోజక వర్గానికి ఒరిగింది ఏమి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్, బీజేపీలు రెండు ఒక్కటేనని, రానున్న ఎన్నికల్లో వారు కలిసి పోటీ చేస్తారని జోస్యం చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్‌ఎస్ చేసిన వడ్డీలు పాపాల పుట్టలా పేరుకుపోయాయని, వాటిని చెల్లించడానికే రాష్ట్ర బడ్జెట్‌లో అధిక మొత్తం ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. పార్టీ మండల అధ్యక్షుడు లావుడ్య రూప్లానాయక్, మేడారం సర్పంచ్ వీర్‌పాల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్త నర్సింహులు, గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, సంగ రంజిత్, కాడె సూర్యనారాయణ, యశోద అజయ్, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.