Share News

బసవేశ్వర ఆశయాలను ఆచరించాలి

ABN , Publish Date - Apr 21 , 2026 | 12:59 AM

బసవేశ్వర ఆశయాలు, ఆలోచనలను మనమంతా ఆచరిస్తే సమానత్వం సాధ్యమవుతుందని అదనపు కలెక్టర్‌ దాసరి వేణు అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వ హించిన బసవేశ్వర జయంతి వేడుకల్లో పలువురు అధికారులతో కలిసి ఆయన పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి, బసవేశ్వరుని చిత్రపటానికి పూల మాలలు వేశారు.

బసవేశ్వర ఆశయాలను ఆచరించాలి

పెద్దపల్లి కల్చరల్‌, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): బసవేశ్వర ఆశయాలు, ఆలోచనలను మనమంతా ఆచరిస్తే సమానత్వం సాధ్యమవుతుందని అదనపు కలెక్టర్‌ దాసరి వేణు అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వ హించిన బసవేశ్వర జయంతి వేడుకల్లో పలువురు అధికారులతో కలిసి ఆయన పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి, బసవేశ్వరుని చిత్రపటానికి పూల మాలలు వేశారు. ఆయన మాట్లాడుతూ సమాజంలోని కుల వ్యవస్థ, అసమానతలు తొలగించేందుకు కృషి చేసిన గొప్ప సంస్కర్త అన్నారు. ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని, శ్రమకు గౌరవం ఇవ్వాలని బోధిం చారని వివరించారు. మహిళలకు సమాన హక్కులు కల్పించేందుకు కృషి చేయడంతోపాటు విద్య, ఆధ్యాత్మికత ద్వారా సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన సూచించారని అన్నారు. సమాజంలో ప్రతి వర్గం అభివృద్ధి చెందాలంటే బసవేశ్వరుని ఆలోచనలు ఎంతో అవసరమన్నారు. జిల్లా బీసీ అభివృద్ధి అధికారి వినోద్‌ కుమార్‌, బీసీ అభివృద్ధి శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 21 , 2026 | 12:59 AM