Share News

సింగరేణిని భ్రష్టుపట్టించిన చరిత్ర బీఆర్‌ఎస్‌దే

ABN , Publish Date - Jul 10 , 2026 | 11:56 PM

సింగ రేణిని భ్రష్టుపట్టించిన చరిత్ర బీఆర్‌ఎస్‌దని, తొమ్మిదేళ్లలో సింగరేణిలో దొంగ లెక్కలు చూపించి సంస్థను నాశనం చేశారని రామగుం డం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నా రు.

సింగరేణిని భ్రష్టుపట్టించిన చరిత్ర బీఆర్‌ఎస్‌దే

గోదావరిఖని, జూలై 10(ఆంధ్రజ్యోతి): సింగ రేణిని భ్రష్టుపట్టించిన చరిత్ర బీఆర్‌ఎస్‌దని, తొమ్మిదేళ్లలో సింగరేణిలో దొంగ లెక్కలు చూపించి సంస్థను నాశనం చేశారని రామగుం డం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నా రు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడు తూ సింగరేణి సంస్థను కేసీఆర్‌ కుటుంబం దోచుకుతిన్నదని, కార్మికులు లాభాలు తీసుకు వస్తే బకాయిలు వసూలు చేయకుండా నిర్లక్ష్యం వహించిందన్నారు. సింగరేణి సీఎండీగా ఉన్న శ్రీధర్‌, జెన్‌కో చైర్మన్‌ ప్రభాకర్‌రావులకు అన్నీ విషయాలు తెలుసని, సంస్థను డిపెండెంట్‌ ఉద్యోగాలు రాకుండా, మారుపేర్ల సమస్యలపై విజిలెన్స్‌పేర డిపెండెంట్లను అప్పటి ప్రభుత్వం వేధించింది కార్మికులందరికి తెలుసునన్నారు. లక్షల కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతు లకు సాగు కోసం ఇచ్చింది 11టీఎంసీల నీరు మాత్రమేనని, మేడిగడ్డ వద్ద నీళ్లు ఆపితే బ్యారేజీ కొట్టుకుపోతుందని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (సీడబ్ల్యూసీ) పేర్కొన్నదన్నారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడంలో కేటీఆర్‌, హరీష్‌రావు పోటీ పడుతున్నారని, ఇంటి దొం గను ఈశ్వరుడైనా పట్టలేరనే చందంగా మాజీ ఎమ్మెల్సీ కవిత కేసీఆర్‌ ఇంటి గుట్టును బయట పెట్టిందన్నారు. హరీష్‌రావు, కేటీఆర్‌లు దోపిడీ దారులని, వారి హయాంలోనే కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, క్రిబ్‌కో కరెన్సీలో రూ.1400 కోట్లు దండుకున్నారని కవిత చెప్పింది వాస్తవ మా కాదా అని ఆయన ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడడం విడ్డూరంగా ఉందని, తాడిచర్ల-2 బ్లాక్‌ సింగరే ణికి ఎప్పుడో వచ్చిందని, అనుమతులు ఇవ్వడం లో ఆలస్యం జరిగిందని, బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తామే తాడిచర్ల-2 బ్లాక్‌ను కేటాయించామని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సింగరేణిలో 40లక్షల టన్నుల బొగ్గు మాయమైందని హరీష్‌రావు చెబుతున్నా రని, ఆ బొగ్గు ఎక్కడికి వెళ్లిందో చూపించాలని సవాల్‌ విసిరారు. రెండున్నర సంవత్సరాల్లో అభివృద్ధిపై చర్చకు వస్తే సమాధానం చెప్పడా నికి సిద్ధంగా ఉన్నా మన్నారు. రామగుం డం అభివృద్ధికి రూ.800కోట్ల నిధుల ను తీసుకువచ్చా నని, అనేక అభివృద్ధి పనులు చేపడుతూ, ప్రజలకు మౌలిక వసతులు కల్పించ డమే లక్ష్యమ న్నారు. రామగుండంను రెవె న్యూ డివిజన్‌గా మరో అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయాన్ని త్వర లోనే తీసుకువస్తానని, జనగామ, గంగానగర్‌, కుందనపల్లి, లింగాపూర్‌ పోలీస్‌ సరిహద్దులను ఇటీవల మార్పులు చేసినట్టు తెలిపారు. సింగరే ణిలో పనులు లోపభూయిష్టంగా ఉన్నాయని, లెస్‌కు టెండర్లు వేసి కాంట్రాక్టర్లు పనులు మధ్యలో వదిలేసి వెళ్లిపోతున్నారని, గ్రావిటీ ఫిల్టర్‌బెడ్‌కు, జీఎం ఆఫీస్‌ వద్ద ఉన్న సర్కిల్‌ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించినట్టు చెప్పారు. మేయర్‌ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్‌ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు దూళికట్ట సతీష్‌, గట్ల రమేష్‌, నాయకులు దీటి బాలరాజు, గుండేటి రాజేష్‌, రంజిత్‌, అశోక్‌, శంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 10 , 2026 | 11:56 PM