Share News

ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హమీలను నెరవేర్చాలి

ABN , Publish Date - Aug 22 , 2026 | 12:12 AM

కాంగ్రెస్‌ పార్టీ ఎన్ని కల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆటో డ్రైవర్లు డిమాండ్‌ చేశారు. సమస్యల సాధన కోసం శుక్రవారం ఆటో డ్రైవర్లు ఆటో జేఏసీ ఆధ్వర్యంలో ఐబీ చౌరస్తా వద్ద అంబేద్కర్‌ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు.

ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హమీలను నెరవేర్చాలి

సుల్తానాబాద్‌, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ ఎన్ని కల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆటో డ్రైవర్లు డిమాండ్‌ చేశారు. సమస్యల సాధన కోసం శుక్రవారం ఆటో డ్రైవర్లు ఆటో జేఏసీ ఆధ్వర్యంలో ఐబీ చౌరస్తా వద్ద అంబేద్కర్‌ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఆటో జేఏసీ జిల్లా, మండల కన్వీనర్‌ ఎలగందుల నాం పల్లి, తాడూరి రమేష్‌, ఉపాధ్యక్షుడు కోటగిరి స్వామి, అధ్యక్షుడు దేశెట్టి రమేష్‌ తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు కావస్తుందని, మహాలక్ష్మి పథకం అమలు చేయడం ఆటోలకు డిమాండ్‌ లేకుండా పోయిందన్నారు. ఈఎంఐలు చెల్లించలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లకు నెలకు పన్నెండు వేల చొప్పున భృతి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఆటో డ్రైవర్లు కలెక్టరేట్‌కు ర్యాలీగా బయలుదేరారు. నాయకులు జిల్లా కోకన్వీనర్‌ బండ సురేష్‌, ప్రధాన కార్యదర్శి రమేష్‌, కోశాదికారి పూసాల అంజయ్య, ప్రభాకర్‌, భైరగోని శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 22 , 2026 | 12:12 AM