ఘనంగా గోదా రంగనాయక స్వామి కల్యాణం
ABN , Publish Date - Jan 13 , 2026 | 11:50 PM
ఎన్టీపీసీ జ్యోతినగర్‌లోని హరిహర ఆల యంలో మంగళవారం పద్మావతి గోదాసమే త వెంకటేశ్వరస్వామి ఆలయంలో గోదా రం గనాయకుల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.
జ్యోతినగర్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): ఎన్టీపీసీ జ్యోతినగర్‌లోని హరిహర ఆల యంలో మంగళవారం పద్మావతి గోదాసమే త వెంకటేశ్వరస్వామి ఆలయంలో గోదా రం గనాయకుల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు వాన మామలై రామాచార్యుల ఆధ్వర్యంలో కల్యాణ దీక్షా కంకణం, యజ్ఞోపవీత ధారణ, పట్టువ స్ర్తాలు, జీలకర బెల్లం, మంగళసూత్రం సమ ర్పించారు. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్, ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్‌కుమార్ సామంత, ఆర్‌ఏ జీఎం బిజోయ్‌కుమార్ పాల్గొన్నారు. అనం తరం పల్లకీ సేవలో పాల్గొన్నారు.
పాలకుర్తి, (ఆంధ్రజ్యోతి): వేమునూర్‌లో అలివేలు మంగ పద్మావతి సమేత వెంక టేశ్వరస్వామి ఆలయంలో గోదాదేవి, రంగ నాథస్వామి కల్యాణ మహోత్సవాన్ని నిర్వ హించారు. వేదమంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల మధ్య కల్యాణం జరిగింది. సమీ ప గ్రామాల నుంచి భక్తులు తరలివ చ్చారు. కల్యాణం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదవితరణ, నిర్వహించారు.
కోల్‌సిటీటౌన్, (ఆంధ్రజ్యోతి): గోదావరిఖని బస్‌డిపో సమీపం లోని కల్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గోదా రంగనాథుల కల్యాణోత్సవం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మం గళ వాయిద్యాల మధ్య గోదా రం గనాథస్వామి కల్యాణం జరిగింది. ఆలయ కమిటీ అధ్యక్షుడు అంబటి అర్చన-సంతోష్‌రావు దంపతులు, కమిటీ సభ్యులు కల్యాణాన్ని జరిపించారు. భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నప్రసాద విత రణలు నిర్వహించారు. జి.శ్రీనివాస్, కృష్ణప్రసాద్, కోటేశ్వరరావు, శంకర్, ముప్పు రాజమౌళి పాల్గొన్నారు.