అర్హులందరికీ పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Nov 14 , 2026 | 11:43 PM
అర్హులైన అందరికీ పింఛన్లు మంజూరు చేశామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పట్టణంలోని ఎస్విఆర్ ఫంక్షన్ హాల్లో శనివారం మున్సిపల్తో పాటు మండలంలోని 27 గ్రామ పంచాయతీలకు చెం దిన అర్హులకు చేయూత పెన్షన్లు పంపిణీ చేశారు.
సుల్తానాబాద్, నవంబరు14(ఆంధ్రజ్యోతి): అర్హులైన అందరికీ పింఛన్లు మంజూరు చేశామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పట్టణంలోని ఎస్విఆర్ ఫంక్షన్ హాల్లో శనివారం మున్సిపల్తో పాటు మండలంలోని 27 గ్రామ పంచాయతీలకు చెం దిన అర్హులకు చేయూత పెన్షన్లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులందరికీ పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదలు, మహిళలు, చేనేత, గీత తదితర వృత్తిదారుల సంక్షేమానికి ప్రాధా న్యం ఇస్తున్నామని తెలిపారు. పింఛన్ల కోసం ఏళ్ల తర బడి నిరీక్షించి ఇబ్బందులు పడిన వారికి ఊరట కలి గిస్తూ 1041 మందికి పింఛన్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. పెన్షన్ తిరస్కరణకు గురైన వారిలో అర్హులైన వారిని గుర్తించి అందిస్తామన్నారు. గతంలో 9 ఏళ్లు అధికారంలో ఉన్న వారు పెన్షన్లు అందించిన దాఖలాలు లేవని వివరించారు. కొందరు కావాలని ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కరువు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని అలాంటి వారి మాటలు నమ్మవ ద్దని వివరించారు. విద్యుత్ సంక్షోభం లేదని ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరంత రాయంగా విద్యుత్ అందించే బాధ్యత తమదేనని తెలి పారు. ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తుందని వివరించారు. మంజూరు ప్రొసీడింగ్స్ పొందిన లబ్ధిదా రులకు ఈ నెల 19న ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా పింఛన్ సొమ్ము జమ అవుతుం దని స్పష్టం చేశారు. పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వృద్ధుల కు మార్చి, ఏప్రిల్ నెల నుంచి కొత్త ప్రక్రియ ప్రారంభించి, 3, 4 నెలల వ్యవధిలో అర్హులకు అంది స్తామని తెలి పారు. సుల్తానా బాద్ మండలానికి మొదటి విడ తలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లలో దాదాపు 800 మంది ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించారని, ఇచ్చిన మాట ప్రకా రం పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని పేర్కొ న్నారు. మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, డిఆర్డిఏ ఏపీడి రవీందర్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మిను పాల ప్రకాష్, సింగిల్ విండో చైర్మన్లు చిలుక సతీష్, భాస్కర్ రెడ్డి, కళ్లేపల్లి జానీ, మురళీర్రావు, శ్రీగిరి శ్రీని వాస్ రావు, పట్టణ అధ్యక్షుడు అబ్బయ్య గౌడ్, ఎంపీ డీవో దివ్య దర్శన్ రావు, కౌన్సిలర్లు, పాల్గొన్నారు.