ప్రజా సంక్షేమాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Apr 15 , 2026 | 12:16 AM
రాష్ట్రంలోని ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. శివకిరణ్ గార్డెన్స్‌లో మంగళవారం మున్సిపల్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
మంథని, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. శివకిరణ్ గార్డెన్స్‌లో మంగళవారం మున్సిపల్ పరిధిలో 130 మంది, వివిధ గ్రామాలకు చెందిన 350 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను, 129 మంది లబ్ధిదా రులకు కల్యాణలక్ష్మి చెక్కులను, 169 మంది సీఎంఆర్‌ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులను, 160 మంది అంగన్‌వాడి టీచర్లకు సెల్‌ఫోన్‌లను, గ్యాస్ స్టవ్ లను మంగళవారం మంత్రి శ్రీధర్‌బాబు పంపిణీ చేశారు. జేబీఎస్ పాఠశా లను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవటానికి తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. విద్య, వైద్యం, సంక్షేమం, అభివృద్ధి, మౌలిక వసతులకు ప్రాధాన్యతను ఇస్తూ ముందుకు సాగుతుందన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఆర్డీవో సురేష్, మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ సహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.