మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Oct 04 , 2026 | 12:15 AM
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్య మని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు అన్నారు. శనివారం భూపతిపూర్‌లో స్వశక్తి సంఘాల మహిళల ఆధ్వర్యంలో సుమారు రూ.1.15 కోట్ల వ్యయం తో ఏర్పాటు చేసిన
సుల్తానాబాద్, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్య మని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు అన్నారు. శనివారం భూపతిపూర్‌లో స్వశక్తి సంఘాల మహిళల ఆధ్వర్యంలో సుమారు రూ.1.15 కోట్ల వ్యయం తో ఏర్పాటు చేసిన చైతన్య జ్యోతి పెట్రోల్ పంపు ప్రారం భోత్సవంలో కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ విజయరమణారావు మాట్లాడుతూ మహి ళలకు సోలార్ పవర్ ప్లాంట్లు, ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ పంపులు ఏర్పాటుతో పాటు చిన్న దుకాణాలు, టిఫిన్ సెంటర్లు, స్కూల్ యూనిఫామ్‌ల కుట్టు కేంద్రాలు తది తర రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. పెద్దపల్లి నుంచి స్వశక్తి సంఘాల మహిళల ఆధ్వర్యంలో 7 ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయని తెలిపారు. మహిళ లు రైస్‌మిల్లులు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించేం దుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్వశక్తి సంఘా లకు వడ్డీలేని రుణాల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని చెప్పారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 15,715 స్వశక్తి సంఘాలకు రూ.33.42 కోట్ల మేర రుణాలు అందించామని వివరించారు. స్వశక్తి సం ఘాల సభ్యులకు బీమా భరోసా కల్పిస్తు న్నామని తెలిపారు. సహజ మరణం సంభవించిన మహిళ లకు రూ.2 లక్షలు, ప్రమాదవ శాత్తు మర ణించిన మహిళలకు రూ.10 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పి స్తోందన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లను సజావుగా నిర్వహించా లన్నారు. యాసంగి లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి సారించాలని సూచించారు. కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ మహిళలకు విహబ్, పెట్రోల్ పంపులు తదితర ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని తెలిపారు. మంథనిలో టైలరింగ్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, స్వశక్తి సంఘాల మహిళలకు సుమారు రూ.33 కోట్ల మేరకు వడ్డీ రాయితీ ప్రయోజనం అందించామని తెలిపారు. మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు టాస్క్ ద్వారా ప్రత్యేకం గా కృషి చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌కు వెళ్లి ఉద్యోగం చేయలేని మహిళలకు జిల్లాలోనే వర్క్‌ఫ్రమ్ హోమ్ అవ కాశాలు కల్పించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఒంటరి మహిళలకు ప్రత్యేకంగా ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. జిల్లా గ్రంథా లయ చైర్మన్ అన్నయ్య గౌడ్, డీఆర్‌డీఓ కాళిందిని, అడిష నల్ డిఆర్డిఓ రవీందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ మిను పాల ప్రకాష్, సొసైటీ ఛైర్మన్ కల్లేపల్లి జానీ, సర్పంచులు జూపల్లి తిరుమల్ రావు, ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.