మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Jan 20 , 2026 | 12:29 AM
మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నాడని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో సోమవారం మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
పెద్దపల్లిటౌన్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నాడని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో సోమవారం మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పెద్దపల్లి మున్సిపాలిటికి కోటీ 3 లక్షల 67 వేల వడ్డీలేని రుణాలు 490 సంఘాలకు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. బ్యాంకు లింకేజి రుణాలు 315 సంఘాలకు 49 కోట్లు ఇచ్చామన్నారు. శ్రీనిధి రుణాలు 15సంఘాలకు 9 కోట్ల రూపాయలు ఇవ్వగా 36 కొత్త మహళా సంఘాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి పథకంపై కేటరింగ్ సర్వీసెస్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ డైరీ ప్రాజెక్ట్స్ ఫ్యాన్సీ స్టోర్, సూపర్‌మార్కెట్, సారీ సెంటర్స్ మొబైల్ క్యాంటిన్ వంటి వాటిలో ఉపాధి అవకాశం కల్పిస్తూ, 124 సంఘాల సభ్యులకు 4 కోట్ల 9లక్షల రుణాలు బ్యాంకు లింకేజి ద్వారా మంజూరు చేశామని పేర్కొన్నారు. గత పదేళ్ళ పాలనలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రుణాలు ఎగవేయడంతో పాటు కొత్త రుణాలు ఇవ్వలేదన్నారు. పదేళ్ళలో అప్పటి ఎమ్మెల్యే పట్టణంలో కేవలం 36 కోట్ల రూపాయల అభివృద్ధి చేశాడని, తాను గెలిచిన రెండేళ్ళలో 89 కోట్ల రూపాయల అభివృధ్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రతీ నిరుపేదకు ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తామన్నారు. పలు వార్డుల్లో ఇందిరమ్మ ఇండ్లకు పూజలు చేసి ప్రోసిండిండ్‌లు అందజేశారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, మున్సిపల్ అధికారులు, కొమ్ము సుధాకర్, ఎరుకల రమేష్, సయ్యద్ మస్రత్, అమ్రీష్, జగదీష్ మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.