Share News

రైతులను రాజులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - May 05 , 2026 | 12:05 AM

రైతులను రాజులను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పని చేస్తుందని ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. కనుకుల రైతు వేదికలో సోమవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతుల అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

రైతులను రాజులను చేయడమే  ప్రభుత్వ లక్ష్యం

సుల్తానాబాద్‌, మే 4 (ఆంధ్రజ్యోతి): రైతులను రాజులను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పని చేస్తుందని ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. కనుకుల రైతు వేదికలో సోమవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతుల అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు పంటల సీజన్‌కు సంబంధించిన సాగు వివరాలను తెలుపుతూ రైతులకు అవగాహన కల్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతు గత ప్రభుత్వ హయాంలో వరి వేస్తే ఉరే అన్న వారు తమ ప్రభుత్వం రైతుల కోసం చేస్తున్న పనులను చూసి, సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేకపోతున్నారన్నారు.

మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలను సాగు చేయాలని, ప్రస్తుతం ఆయిల్‌పామ్‌కు మంచి డిమాండ్‌ ఉందని, రైతులు ముందుకు వచ్చి మంచి దిగుబడులు సాదిస్తూ అధిక ఆదాయం పొందాలని సూచించారు. పెద్దపల్లి నియోజకవర్గంలో రైసుమిల్లర్లను, అధికారులను ఒప్పించి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కిలో కటింగ్‌ లేకుండా కొనుగోళ్లు జరిపిస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో పది నుంచి పదిహేను కిలోల కటింగ్‌లు చేస్తూ మిల్లర్లు ప్రజాప్రతినిదులు కుమ్మక్కయ్యారన్నారు. మార్కెట్‌ ఛైర్మన్‌ మినుపాల ప్రకాష్‌ రావు, పలు గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. కాగా మండలంలోని అన్ని రైతు వేదికల వద్ద అవగాహన సదస్సులు నిర్వహించారు.

Updated Date - May 05 , 2026 | 12:05 AM