Share News

రైతులు సంతోషంగా ఉండడమే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Nov 04 , 2026 | 11:46 PM

రైతులు సంతోషంగా ఉండాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. బుధవారం సుల్తానాబాద్‌ సహకార సంఘం ఆవరణలో నిర్వహించిన రైతు సదస్సుకు ఆయన మాట్లాడారు.

రైతులు సంతోషంగా ఉండడమే  ప్రభుత్వ లక్ష్యం

సుల్తానాబాద్‌, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): రైతులు సంతోషంగా ఉండాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. బుధవారం సుల్తానాబాద్‌ సహకార సంఘం ఆవరణలో నిర్వహించిన రైతు సదస్సుకు ఆయన మాట్లాడారు. వానాకాలం పంటల చివరి దశలో సాగునీటి అవసరం ఏర్పడి నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మాట్లాడి నీటిని విడుదల చేయించి పంటలను కాపాడామని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం ఉందని, ఈ పరిస్థితుల్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికా రులు, వ్యవసాయ నిపుణుల సూచనల మేరకు రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని పంటల ఎంపిక చేసుకుంటే రైతులకు ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుం దన్నారు. ఎల్‌నినోపై కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బాధ్యులను చేస్తూ ప్రతిపక్ష నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రకృతి వైపరీత్యాలకు ప్రభుత్వాలను బాధ్యులను చేయ డం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని 13 నియోజకవర్గాలకు ఏ మేరకు సాగునీటి ప్రయోజనం కలిగిందో బీఆర్‌ఎస్‌ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. యాసంగి రైతులకు రోజుకు 12 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా అందిస్తామని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్ల సందర్భంగా రైతులకు ఎలాంటి కోతలు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతటి అన్నయ్య గౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మినుపాల ప్రకాశ్‌రావు, మున్సిపల్‌ చైర్మన్‌ బిరుదు రాధాక్రిష్ణ, సింగిల్‌ విండో చైర్మన్లు శ్రీగిరి శ్రీనివాస్‌, చిలుక సతీష్‌, కల్లెపల్లి జానీ, మండల వ్యవసాయాధికారి పైడితల్లి, శాస్త్రవేత్త సంతోష్‌, సీఈఓ బూరుగు సంతోష్‌, సర్పంచ్‌ కాంపెల్లి సతీష్‌, దామోదర్‌రావు, సాయిరి మహేందర్‌, కౌన్సిలర్లు ఓట్ల వరప్రదీప్‌, చింతల రాజు, టీకే ప్రభాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 04 , 2026 | 11:46 PM