Share News

మహిళలను మోసం చేసిన ప్రభుత్వం

ABN , Publish Date - Sep 28 , 2026 | 12:22 AM

మహాలక్ష్మి పథకం పేరిట మహిళలను కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. ఆర్టీసీ బస్టాండ్‌లో ఆదివారం ప్రయాణి కులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

మహిళలను మోసం చేసిన ప్రభుత్వం

మంథని, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): మహాలక్ష్మి పథకం పేరిట మహిళలను కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. ఆర్టీసీ బస్టాండ్‌లో ఆదివారం ప్రయాణి కులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన విలేకరులతో మాట్లా డుతూ.. ఉచిత ప్రయాణం నియంత్రించేలా ప్రభుత్వం గతంలో ఉన్న బస్సులు తగ్గించి చార్జీలు పెంచుతూ ప్రయాణికులను దోపిడీ చేస్తుం దన్నారు. మంథని నుంచి సిద్దిపేటకు బస్సు నడిపించడం వెనుక పెద్ద కుట్ర ఉందనే విషయాన్ని గుర్తించాలన్నారు. హైదరాబాద్‌, దిల్‌సుఖ్‌ నగర్‌, మియాపూర్‌ బస్సును రద్దు చేసి కేవలం సిద్దిపేట వరకు నడిపి స్తున్నారన్నారు. ప్రభుత్వం మహిళలను మోసం చేస్తున్న తీరుకు ఎన్ని కల మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్‌ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బాధ్యత వహిం చాలన్నారు. మంథని నుంచి రద్దు చేసిన భద్రాచలం, హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులను పునరుద్దరించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టో అమలు కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు ఏగోళపు శంకర్‌గౌడ్‌, మాచీడి రాజుగౌడ్‌, కనవేన శ్రీనివాస్‌, గొబ్బూరి వంశీ, వేల్పుల గట్టయ్య, శంకేసి రవీందర్‌, నాగెల్లి సాంబయ్య, శేఖర్‌, కుమార్‌, జీవీద్‌లు పాల్గొన్నారు.

Updated Date - Sep 28 , 2026 | 12:22 AM