అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాలి
ABN , Publish Date - Mar 21 , 2026 | 12:11 AM
నేలవాలిన పంటలకు నష్టపరిహారం అందించి రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మండలంలోని కూనారం, వెన్నంపల్లి, మంగపేట, జాఫర్‌ఖాన్‌పేట గ్రామాల్లో ఈదురుగాలులతో కురిసిన వడగళ్ల వాన వల్ల నష్టపోయిన మొక్కజొన్న క్షేత్రాలను సందర్శించారు.
కాల్వశ్రీరాంపూర్, మార్చి20(ఆంధ్రజ్యోతి): నేలవాలిన పంటలకు నష్టపరిహారం అందించి రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మండలంలోని కూనారం, వెన్నంపల్లి, మంగపేట, జాఫర్‌ఖాన్‌పేట గ్రామాల్లో ఈదురుగాలులతో కురిసిన వడగళ్ల వాన వల్ల నష్టపోయిన మొక్కజొన్న క్షేత్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా రైతులను ఓదార్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నష్టపోయిన రైతుకు ఎకరాకు రూ.40 వేల నష్టపరిహారం అందించాలని అన్నారు. అధికారులు నష్టపోయిన పంటను సర్వే చేసి నివేదికలు రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని కోరారు. మాజీ ఎంపీపీ నూనేటి సంపత్, వెన్నంపల్లి మాజీ ఎంపీటీసీలు జెట్టి దేవెందర్, కూనారం సర్పంచ్ మంతెన రాజయ్య, కూనారం ఫ్యాక్స్ మాజీ చైర్మన్ కొట్టె సమ్మయ్య, ఆకుల స్వామి, బీఆర్‌ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.