ప్రభుత్వం కోడిగుడ్లను సరఫరా చేయాలి
ABN , Publish Date - Jul 01 , 2026 | 12:00 AM
ప్రభుత్వం కోడిగుడ్లు సరఫరా చేసే వరకు విద్యార్థులకు కోడి గుడ్లను అందించలేమని మధ్యాహ్న భోజన రాష్ట్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పూసాల రమేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్‌లు స్పష్టం చేశారు.
పెద్దపల్లి టౌన్, జూన్ 30 (ఆంఽధ్రజ్యోతి): ప్రభుత్వం కోడిగుడ్లు సరఫరా చేసే వరకు విద్యార్థులకు కోడి గుడ్లను అందించలేమని మధ్యాహ్న భోజన రాష్ట్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పూసాల రమేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్‌లు స్పష్టం చేశారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా అనంతరం వారు మాట్లాడారు. మధ్యాహ్న భోజన కార్మికులు 24 సంవత్సరాలుగా శ్రమ, ఆర్థిక దోపిడీకి గురవు తున్నామని, ఒక గుడ్డుకు ఆరు రూపాయలు మాత్రమే ప్రభుత్వం ఇస్తుందని, మార్కెట్లో ఏడు రూపాయల నుండి 8 వరకు విక్రయిస్తు న్నారన్నారు. అధికారులు వారానికి మూడు కోడిగుడ్లను ఇవ్వాలని ఒత్తిడికి గురి చేస్తున్నా రని, అంగన్వాడి సెంటర్లకు ఇచ్చిన విధంగా గుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. గ్యాస్ ఉచితంగా సరఫరా చేయాలని, రాగి జావా సత్యసాయి ట్రస్ట్, రాగి పౌడర్లు బెల్లాన్ని అందిస్తుందని, విద్యార్థులకు అందించుటకు 25 పైసలు కేటాయించారని, వందమంది విద్యార్థులు ఉన్నచోట కేవ లం 25 రూపాయలు మాత్రమే వస్తాయన్నారు. ఎన్నికల ముందు మధ్యా హ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించి పదివేల రూపాయల వేత నం ఇస్తామని, మెస్ చార్జీలు పెంచి పిల్లలకు పౌష్టికాహారం అందిస్తా మని తెలిపిన కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంద న్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్య లు పరిష్కరించకుంటే ఆగస్టు 15 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. తిపిరిశెట్టి లావణ్య, అంక విజయ్, పాఠకుల కళావతి, నేటి రాధమ్మ, ఎండీ జూబేదా, పిడుగు గట్టయ్య, తదితరులున్నారు.