గోదావరిని ఎడారిగా మారుస్తున్న ప్రభుత్వం
ABN , Publish Date - Jun 27 , 2026 | 12:01 AM
కాళేశ్వరం ప్రాజెక్టులో అన్నారం, సుందళ్ళ బ్యారేజీల గేట్లు ఓపెన్ చేసి పెట్టి గోదావరి నదిని ఎడారిగా మార్చిన పాపం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబులదేనని మాజీ ఎమ్మల్యే పుట్ట మధు ఆరోపించారు.
మంథని, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో అన్నారం, సుందళ్ళ బ్యారేజీల గేట్లు ఓపెన్ చేసి పెట్టి గోదావరి నదిని ఎడారిగా మార్చిన పాపం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబులదేనని మాజీ ఎమ్మల్యే పుట్ట మధు ఆరోపించారు. గోదావరినది తీరాన్ని శనివా రం సందర్శించిన ఆయన మాట్లాడుతూ.. అన్నారం బ్యారేజీ నుంచి రోజుకు 10 వేల క్యూసెక్‌ల నీరు వృథాగా పోతుందన్నారు. ఎల్‌నినో ఎఫె క్టుతో సకాలంలో వర్షాలు కురియక రైతాంగం సాగునీరు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. గోదావరినదిలోని సుందిళ్ళ, అన్నారం బ్యారేజీల్లో గేట్లు మూసి నీటి నిల్వ చేసి గోదావరినది తీర ప్రాంత రైతులకు సాగు నీరు అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ఇసుక తవ్వకాలపై ఉన్న శ్రద్ధ రైతుల సాగునీటి కష్టాల పై లేదన్నారు. ఉన్న బోనస్ సైతం కేవలం ఏడు రకాల వడ్లకే పరిమితం చేయడం తగద న్నారు. నదిలో కనీసం స్నానం చేయటానికి సైతం నీళ్ళు లేక ప్రజలు సైతం ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని బ్యారేజీల్లో నీటి నిల్వ చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ నేతలు ఏగోళపు శంకర్‌గౌడ్, తగరం శంకర్‌లాల్, మాచీడి రాజుగౌడ్, కనవేన శ్రీనివాస్, పుప్పాల తిరుపతి, జంజర్ల శేఖర్‌లు పాల్గొన్నారు.