Share News

బీఆర్‌ఎస్‌ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పని చేయాలి

ABN , Publish Date - Jan 06 , 2026 | 12:37 AM

మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్‌ పిలుపునిచ్చారు. సోమవారం అడ్దగుంటపల్లిలోని ఒక ఫంక్షన్‌హాల్‌లో రామగుండం నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.

బీఆర్‌ఎస్‌ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పని చేయాలి

గోదావరిఖని, జనవరి 5(ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్‌ పిలుపునిచ్చారు. సోమవారం అడ్దగుంటపల్లిలోని ఒక ఫంక్షన్‌హాల్‌లో రామగుండం నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. చందర్‌ మాట్లాడుతూ అబద్దాలు మోస పూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు అస్యహించుకుంటున్నారన్నారు. కూల్చివేతలు కమీషన్లు ఎమ్మెల్యేకు, కాంగ్రెస్‌ పార్టీ నేతలకు దిన్యచర్యగా మారిందన్నారు. ప్రశ్నిస్తే కేసులు పడుతున్నారన్నారు. చిరు వ్యాపారుల దుకాణాలు కూల్చి వారిని రోడ్డుపారేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీకే దక్కుతుందన్నారు. నగర పాలక సంస్థలో ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేసేందుకు సిద్దంకావాలన్నారు. అనంతరం సర్పంచ్‌ ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులను కోరుకంటి చందర్‌ సన్మానించారు. బీఆర్‌ఎస్‌ నాయకులు మూల విజయరెడ్డి, కౌశిక హరి, మిర్యాల రాజిరెడ్డి, పర్లపల్లి రవి, నారాయణదాసు మారుతి, నడిపెల్లి మురళీధర్‌రావు, గోపు ఐలయ్య యాదవ్‌, మాజీ జెడ్‌పీటీసీ ఆముల నారాయణ, మాజీ కార్పొరేటర్లు పాముకుంట్ల భాస్కర్‌, బొడ్డు రవీందర్‌, కల్వచర్ల కృష్ణవేణి, బాదే అంజలి, మందల కిషన్‌రెడ్డి, కుమ్మరి శ్రీనివాస్‌, గాధం విజయ, పాల్గొన్నారు.

రామగిరి, (ఆంధ్రజ్యోతి): ఏ పార్టీకైనా కార్యక ర్తలే సుప్రీంలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు అన్నారు. సోమవారం సెంటినరీ కాలనీలోని సాయిరాంగార్డెన్‌లో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఎక్కడకు వెళ్ళినా కోవర్టులు అన్యా యం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవా లని అంటున్నారన్నారు. అసలు వారి పై చర్యలు తీసుకోవాల్సింది కార్యకర్తలేనని సూచించారు. పార్టీ నాయకత్వన్ని నిలబెట్టే ప్రతీ కార్యకర్తకు పార్టీ అండగా నిలుస్తోందన్నారు. మంథని ఎమ్మె ల్యే, మంత్రి మండలంలో తట్టెడు మట్టిపోయ లేదని, ఈ విషయంపై ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ఎమ్మేల్యేగా తాను నాల్గు సంవత్స రాలు పనిచేస్తే దుద్ధిళ్ల కుటుంబం 40 ఏండ్లుగా అధికారంలో ఉందన్నారు. సింగరేణి సంస్థ మనుగడకు పాటుపడుతున్న కార్మికుల సొమ్మును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫుట్‌బాల్‌ ఆట కోసం కోట్లు వెచ్చించాడని విమర్శించారు. లద్నాపూర్‌లో 283 గృహలకు డబ్బులు ఇప్పి స్తాడంటూ కాలర్‌ ఎగారవేసిన కాంగ్రెస్‌ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలని సూచించారు. నాయకులు శంకేషిరవీందర్‌, పూదరి సత్యనారయణగౌడ్‌, అల్లంతిరుపతి, మంతెన చంటి, మ్యాదరవేని కుమార్‌, కాపురబోయిన భాస్కర్‌, ఆసంతిరుపతి, వెగొలపు మల్లయ్య, చెల్కల జవహర్‌, మద్దెల ఒదెలు పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2026 | 12:38 AM