Share News

మహిళల రక్షణే షీటీం ధ్యేయం

ABN , Publish Date - May 08 , 2026 | 11:34 PM

మహిళల రక్షణ, భద్రత షీటీం ప్రధాన ధ్యేయమని రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా అన్నారు. శుక్రవారం సీపీ కార్యాలయంలో యాంటి హ్యుమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌ భరోసా కేంద్రాల సిబ్బందితో సమీక్ష సమావే శాన్ని నిర్వహించారు.

మహిళల రక్షణే షీటీం ధ్యేయం

కోల్‌సిటీ, మే 8(ఆంధ్రజ్యోతి): మహిళల రక్షణ, భద్రత షీటీం ప్రధాన ధ్యేయమని రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా అన్నారు. శుక్రవారం సీపీ కార్యాలయంలో యాంటి హ్యుమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌ భరోసా కేంద్రాల సిబ్బందితో సమీక్ష సమావే శాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ షీటీం ఎల్లప్పుడూ మహిళలకు అండగా ఉంటుందని, బస్టాండ్‌, ప్రధాన కూడళ్లు, కళాశాలలు, పాఠశాలల ప్రాంతాల్లో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. భరోసా కేంద్రాల్లో లీగల్‌ అడ్వయిర్‌, కౌన్సిలర్‌, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. లైంగిక వేధింపులకు గురైన మహిళలకు, బాలికలకు సంబంధించిన కేసులు, పోలీస్‌ స్టేషన్‌లో నమోదు కాగానే అవసరమైన సహాయం అందిస్తూ వారి మానసిక పరిస్థితి, విద్యా పరిస్థితులు ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలని సూచించారు. పిల్లల అశ్లీల వీడియోలు, అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలకు సంబంధించిన వీడియో లను అప్‌లోడ్‌ చేయడం లేదా డౌన్‌లోడ్‌ చేయడం ఐటీ చట్టంలోని సెక్షన్‌ 67బీ ప్రకా రం నేరమన్నారు. యువతులు,మహిళలు అత్యవసర పరిస్థితుల్లో షీటీం నెంబర్లకు, లేదా 100నెంబర్‌కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. రామగుండం పోలీస్‌ కమిష రేట్‌ షీటీం నెంబర్‌ 6303923700, పెద్దపల్లి జోన్‌ నెంబర్‌ 8712659384, మంచిర్యాల జోన్‌ 8712659385 నెంబర్‌కు కాల్‌చేయాలన్నారు. అడిషనల్‌ డీసీపీ(అడ్మిన్‌) శ్రీనివాస్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసీపీ నాగేంద్రగౌడ్‌, ఇన్‌స్పెక్టర్‌ భీమేష్‌, పెద్దపల్లి ఏహెచ్‌టీయూఎస్‌ఐ శైలజ, షీటీమ్‌ ఎస్‌ఐ ఉషారాణి, భరోసా కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2026 | 11:34 PM